AP politics: పక్క వ్యూహంతో సింగిల్ గా జనాలలోకి దూసుకెళ్తున్న జగన్.. గెలుపే లక్ష్యంగా?

AP politics: ఏపీలో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత పొలిటికల్ హీట్ మరింత పెరిగిపోయింది. వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి పొత్తులు లేకుండా ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు కానీ మరోవైపు టిడిపి జనసేన బిజెపి కూటమిగా ఎన్నికల బరిలోకి రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా భారీ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పోటీకి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

ఇక ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఈయన ప్రాంతాలవారీగా సిద్ధం సభలను ఏర్పాటు చేసి నాయకులలోను కార్యకర్తలను ఫుల్ జోష్ నింపారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రచార కార్యక్రమాలలో భాగంగా సరికొత్త వ్యూహాలను రచిస్తూ జనాలలోకి వెళ్ళబోతున్నారని తెలుస్తుంది. ఈయన ఇప్పటికే ఏ నియోజకవర్గం లో ఎన్ని రోజులు పర్యటించాలి ఎక్కడ బహిరంగ సభలు నిర్వహించాలి ఎక్కడ రోడ్డు షో చేయాలి అనే విషయాల గురించి పక్కాగా ప్లాన్ సిద్ధం చేశారని తెలుస్తోంది.

2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసి 151 స్థానాలలో విజయకేతనం ఎగురు వేసినటువంటి వైసీపీ పార్టీ ఈసారి మాత్రం వై నాట్ 175 అనే నినాదంతో ఎన్నికల బరిలోకి దిగబోతోంది తాము ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 99% అమలు పరిచాము. అందుకే వై నాట్ 175 అనే ధీమాతో జగన్ ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. 2019 ఎన్నికల ఫలితాలను ఈసారి కూడా రిపీట్ చేయాలని ఈయన తన అభ్యర్థులను కార్యకర్తలను కూడా సిద్ధం చేస్తున్నారు.

వై నాట్ 175
ఇలా వై నాట్ 175 అంటూ ఎన్నికలకు జగన్మోహన్ రెడ్డి సిద్ధం కాగా మరోవైపు కూటమిగా అన్ని పార్టీలు ఏకమై జగన్మోహన్ రెడ్డి పై యుద్ధానికి మేము సిద్ధం అంటున్నారు. మరి ఈ ఐదేళ్ల ప్రజా పాలనకు జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తున్నారు ఏంటి అనేది తెలియాల్సి ఉంది.