Niharika: నిహారిక పరిచయం అవసరం లేని పేరు మెగా డాటర్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినటువంటి ఈమె ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్ కాకపోవడంతో పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లారు. అయితే అక్కడ కూడా ఈమె తన వైవాహిక బంధాన్ని కొనసాగించలేక విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా భర్త నుంచి దూరంగా ఉన్నటువంటి ఇలియానా ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు.
ఈ విధంగా నిహారిక కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఈమె తన పబ్ అరెస్టు గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నిహారిక రాడిసన్ పబ్ కేసులో భాగంగా అరెస్ట్ అయిన సంగతి మనకు తెలిసింది. అప్పట్లో ఈ అరెస్టు గురించి ఎన్నో రకాల వార్తలు వినిపించాయి అయితే తాజాగా నిహారిక ఈ వార్తలపై స్పందిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
నిజానికి నాకు పబ్ అంటే ఏమాత్రం ఇష్టం ఉండదు కానీ చాలా రోజుల తర్వాత నా స్కూల్ ఫ్రెండ్స్ రావడంతో వారితో కలిసి అక్కడికి వెళ్లానని తెలిపారు అయితే అక్కడ పెద్ద పెద్దగా సౌండ్స్ వస్తూ ఉంటే కంఫర్ట్ గా లేకపోవడంతో బయటకు రావాలని బిల్ పే చేసాము ఇక బయటకు వస్తున్నటువంటి తరుణంలోనే పోలీస్ రైడ్ జరిగి వారితో పాటు మమ్మల్ని కూడా అరెస్టు చేశారని తెలిపారు.
ఆలస్యంగా అర్థమైంది..
ఇలా మమ్మల్ని చాలా అన్యాయంగా అరెస్టు చేశారని అయితే ఇక ఈ మీడియా కూడా రచ్చ చేస్తూ ఏవేవో వార్తలు రాశారని నిహారిక తెలిపారు. నిజానికి అక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతోని రైడ్ చేశారు.. ఈ విషయం నాకు చాలా ఆలస్యంగా తెలిసిందని, నేను ఒక తప్పును ప్రదేశంలో ఉన్నాను అనే విషయాన్ని చాలా లేటుగా అర్థం చేసుకున్నాను అంటూ పబ్ ఘటన గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…