Movie News

Ileana: వారిని ఏమైనా అంటే తట్టుకోలేను.. ఇలియానా లేటెస్ట్ పోస్ట్ వైరల్!

Ileana: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒకానొక సమయంలో ఓ వెలుగు వెలిగినటువంటి వారిలో గోవా బ్యూటీ ఇలియానా ఒకరు. ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగారు. దేవదాసు సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి ఇలియానా మొదటి సినిమాతో సక్సెస్ అందుకున్నారు అనంతరం పోకిరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమెకు క్రమక్రమంగా సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఇండస్ట్రీకి కూడా దూరమయ్యారు. ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఇలియానా సినిమా ప్రయత్నాలు చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ చేసేవారు.

ఇలా సోషల్ మీడియా వేదికగా ఈమె తాను తల్లి కాబోతున్నాననే విషయాన్ని తెలియజేస్తూ అందరికీ షాక్ ఇచ్చారు. అసలు ఈమె పెళ్లెప్పుడు చేసుకుంది పెళ్లి కాకుండానే తల్లి అయిందా అంటూ ఈమె ప్రెగ్నెన్సీ గురించి ఎన్నో రకాల సందేహాలు వచ్చాయి. అయితే ఈమె డెలివరీకి ముందు తన భర్తను అందరికీ పరిచయం చేశారు.

విమర్శిస్తే తట్టుకోలేను..
ఇక ప్రస్తుతం బాబు ఆలనా పాలన చూసుకుంటూ ఫ్యామిలీతో ఎంతో సంతోషంగా గడుపుతున్నటువంటి ఈమె తాజాగా ఒక ఆసక్తికరమైనటువంటి పోస్ట్ చేశారు. తాను ప్రెగ్నెన్సీ తర్వాత కూడా పని చేయాలనుకున్నాను కానీ పరిస్థితులు అనుకూలించలేదని తెలిపారు. తన ప్రెగ్నెన్సీ సమయంలో తన తల్లితోపాటు తన భర్త మైకేల్ ఎంతో సపోర్ట్ చేశారని తెలిపారు. ఇక నేను నా రిలేషన్ గురించి నా భర్త గురించి దాచి పెట్టడానికి కారణం ఉందని తెలిపారు. నన్ను ఏవైనా విమర్శించిన నేను భరిస్తాను కానీ నా తల్లిని, నా భర్తను ఎవరైనా ఏదైనా విమర్శిస్తే తట్టుకోలేనని అందుకే ఈ బంధం గురించి బయట పెట్టలేదు అంటూ ఇలియానా చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

1 day ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

1 day ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 day ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

1 day ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

1 day ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago