Jagapathi Babu: తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు జగపతిబాబు ఒకరు. ఈయన హీరోగా ఒకానొక సమయంలో ఎన్నో కుటుంబ ప్రేమ కథ చిత్రాలలో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఈయన ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలలో నటించడంతో జగపతిబాబుకు ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ అభిమానులుగా మారిపోయారు.
ఈ విధంగా జగపతిబాబు ఒకానొక సమయంలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండేవారు. అయితే క్రమక్రమంగా ఈయనకు అవకాశాలు తగ్గిపోవడంతో జగపతిబాబు కూడా సినిమా ఇండస్ట్రీకి కొంత కాలం పాటు దూరమయ్యారు. ఇలా ఇండస్ట్రీకి దూరమైనటువంటి జగపతిబాబు అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి తరుణంలో ఈయనకు హీరోగా కాకుండా విలన్ పాత్రలలో నటించే అవకాశం వచ్చింది.
ఇలా బాలకృష్ణ హీరోగా నటించిన లెజెండ్ సినిమా ద్వారా విలన్ గా ప్రేక్షకుల ముందుకు వస్తూ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినటువంటి జగపతిబాబు ప్రస్తుతం వరుస సినిమాలలో విలన్ పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా అయ్యారు ఈయన హీరోగా కంటే ప్రస్తుతం విలన్ గాని ఎక్కువ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారని చెప్పాలి.
సూపర్ పోలీస్ అయేవాడిని..
ప్రస్తుతం జగపతిబాబు కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇలా కెరియర్ పరంగా బిజీగా ఉండే ఈయన సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తరచూ అభిమానులతో ఎన్నో విషయాలను పంచుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఈయన మరొక పోస్ట్ కూడా చేశారు. తాను కనుక సినిమాలలోకి రాకపోయి ఉంటే కచ్చితంగా సూపర్ పోలీస్ అయ్యే వాడిననీ తెలిపారు. ప్రస్తుతం ఉన్న పోలీసులు ఎలా అయితే లా అండ్ ఆర్డర్ ను గడగడ లాడిస్తున్నారో నేను కూడా అలాంటి పోలీస్ అయ్యే వాడిని మీరేమంటారు అంటూ పోలీస్ డ్రెస్ లో ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేస్తూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…