YS Jagan: ఎన్నికల లెక్కింపు ప్రక్రియకు కొన్ని గంటల సమయం ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి అయితే కొన్ని ఎగ్జిట్ పోల్స్ వైసిపికి అనుకూలంగా వచ్చాయి మరికొన్ని కూటమికి అనుకూలంగా వచ్చాయి.
ఇలా ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూసిన తర్వాత కార్యకర్తలలోనూ నేతలలోనూ పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒకే మాట మీదే ఉన్నారని తెలుస్తోంది. ఎన్నికలు పూర్తి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఐ ప్యాక్ వారితో మాట్లాడుతూ ఈసారి భారీ మెజార్టీతో గెలవబోతున్నామని 2019 ఎన్నికల కంటే అత్యధిక సీట్లు రాబోతున్నాయని తెలిపారు.
ఇక ఇటీవల విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై జగన్ పెద్దగా స్పందించలేదు. అలాగే ఏ విధమైనటువంటి కంగారు కూడా వ్యక్తం చేయలేదు. ఇక ఎన్నికల ఫలితాలు వెలబడుతున్న నేపథ్యంలో జగన్ పలువురు కీలక నేతలను తాడేపల్లికి పిలిపించారు. ఈ క్రమంలోనే వారికి కొన్ని అంశా నిర్దేశాలు కూడా చేశారని తెలుస్తోంది. కౌంటింగ్ సమయంలో ఎలాంటి గొడవలు అల్లర్లకు తావులేకుండా చూడాలని పిలుపునిచ్చారు.
ఇకపోతే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత గెలిచిన ఎమ్మెల్యేలు అందరిని కూడా ఆరో తేదీ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కు రావాలని సూచించారు. కేవలం ఎమ్మెల్యే అభ్యర్థులు మాత్రమే కాకుండా గెలిచిన ఎంపీ అభ్యర్థులందరూ కూడా సమావేశం కావాలని జగన్ సూచించారు. ఇక జగన్ తన గెలుపుపై ఎంతో ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా జూన్ 9వ తేదీ వైజాగ్ లోనే తన ప్రమాణ స్వీకారం అని కూడా ఈయన వెల్లడించారు. ఇలా ఎంతో ధీమాగా ఉన్నటువంటి జగన్ ఏ స్థాయిలో విజయం సాధిస్తారు ఏంటి అనే విషయాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…