Coconut water: కొబ్బరి నీటితో ఆరోగ్యమే కాదు.. ఈ సమస్యలు కూడా ఉన్నాయి.
Coconut water: ప్రకృతి అందించిన దివ్యజౌషధం కొబ్బరి. కొబ్బరి చెట్టులోని ప్రతీ భాగం మనిషికి ఏదో ఓ రకంగా ఉపయోగపడేదే. కొబ్బరి నీళ్లు మనిషి ఆరోగ్యానికి జౌషధంగా పనిచేస్తాయి. కొబ్బరి నీళ్లుతాగితే గుండెకు సంబంధించి సమస్యలు తగ్గుతాయి. రక్తపోటు అదుపులో ఉంటుంది. జీవక్రియ రేటు పెరగడమే కాకుండా… బరువు తగ్గుతారు. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో మాంగనీస్ పుష్కలంగా ఉంటుంది.
జ్వరం.. లేదా ఎదైనా సమస్యలు వచ్చినా.. పరామర్శించేందుకు వచ్చేవారికి ముందుగా గుర్తుకువచ్చేది కొబ్బరి బొండాలే. అంతగా ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుందని కొబ్బరికి పేరుంది. కొబ్బరి నీళ్లలో ఉంటే ఖనిజాలు.. శరీరానికి శక్తినిస్తాయి.
ఇదిలా ఉంటే కొబ్బరి నీరును తీసుకునే కొన్ని సందర్భాల్లో ఇవి ఆరోగ్యానికి చేటు చేస్తాయి. కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి శరీరంలో నీటి శాతాన్ని పెంచుతాయి. అలాగే సరైన సమయంలో కాకుండా.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొబ్బరి నీటిని తీసుకుంటే… సమస్యలు ఏర్పడుతాయి.
జలుబు ఉన్నవారు రాత్రిళ్లు కొబ్బరి నీళ్లు అస్సలు తాగకూడదు. అలాగే కడుపులో సమస్యలు ఉన్నవారు కూడా .. కొబ్బరి నీటికి దూరంగా ఉండాలి. శరీరంలో నీటిని పెంచి విరేచనాలకు కారణం అవుతుంది. కొందరికి ప్రతీసారి జలుబు చేస్తుంది. వీరు చల్లని పదార్థాలకు దూరంగా ఉండాలి. కొబ్బరినీరు చల్లగా ఉండటంతో.. మళ్లీ జలుబు పెరిగే అవకాశం ఉంది. అధిక రక్తపోటుకు మందులు వాడే వారు కొబ్బరీ నీరు ఎక్కువగా తాగకూడదు. ఇందులో రక్తపోటును తగ్గించే గుణాలు ఉంటాయి. దీని వల్ల తక్కువ రక్తపోటు సమస్యలు ఎదురవుతాయి.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…