ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న తరుణంలో కొత్త కొత్త ఫుడ్ ట్రెండ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్నది బుల్లెట్ కాఫీ. బరువు తగ్గాలనుకునే వారు, కీటో డైట్ పాటించే వారు దీనిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇది నిజంగా వెయిట్ లాస్‌కు సహాయపడుతుందా? అన్న ప్రశ్నపై నిపుణులు వివరణ ఇస్తున్నారు.
సాధారణ కాఫీకి భిన్నంగా, బుల్లెట్ కాఫీ తయారీలో పాలు లేదా చక్కెర వాడరు. బ్లాక్ కాఫీలో వెన్న లేదా నెయ్యి కలిపి తయారు చేస్తారు. ఈ మిశ్రమంలో ఉండే కొవ్వు పదార్థాలు శరీరానికి త్వరగా శక్తిని అందిస్తాయని, ఇన్సులిన్ స్థాయిలపై పెద్దగా ప్రభావం చూపవని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గడంలో ఈ కాఫీ పాత్రపై మిశ్రమ అభిప్రాయాలు ఉన్నాయి. ఇందులోని ఫ్యాట్స్ కారణంగా ఎక్కువసేపు ఆకలి వేయకపోవడం ఒక ప్రయోజనం. ఉదయం దీనిని తీసుకుంటే మధ్యలో తినే అలవాటు తగ్గవచ్చు. దీంతో రోజువారీ కేలరీల వినియోగం కొంతవరకు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.
అయితే, ఈ కాఫీ అందరికీ సరిపోదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కొలెస్ట్రాల్ సమస్యలు లేదా గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. అధిక కొవ్వు ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉందని సూచిస్తున్నారు.
ఇక బుల్లెట్ కాఫీ ఒక్కటే తాగితే బరువు తగ్గిపోతుందనుకోవడం సరైంది కాదు. సమతుల్య ఆహారం, క్రమమైన వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం తప్పనిసరి. ఈ కాఫీని కేవలం ఆకలిని నియంత్రించే ఒక ఎంపికగా మాత్రమే ఉపయోగించాలి. సరైన మార్గంలో ఉపయోగిస్తేనే ఆశించిన ఫలితాలు కనిపిస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…