బుల్లితెర మీద ఎన్ని కామెడీ షో లు వచ్చినా సరే ఈ టీవిలో జబర్దస్త్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఇది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ షోనే. ఈటీవీ TRP రేటింగ్స్ చాలా వరకు ఈ జబర్డస్ట్ వచ్చే టైంలోనే వస్తున్నాయి అంటే దాన్ని బట్టి అర్ధం అర్థంచేసుకోవచ్చు. జబర్దస్త్ షో క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో.. తెలుగులో ఒక కామిడి రియాలిటీ షో ఇంత అద్భుతమైన సక్సెస్ అవుతుందని ఎవరు ఊహించని కూడా లేదు. అంతేకాదు ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్స్ జీవితాలు కూడా ఓ రేంజ్ లో మారిపోయాయి. ఒకే ఒక్క షో తోనే స్టార్స్ అయిపోయారు. అంతేకాదు ఈ కామెడీ షో ద్వారా చాలా మంది కొత్త కొత్త కమెడియన్స్ టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. ఒక్కసారిగా వీరి జీవితాలు మారిపోయాయి. డబ్బులు, క్రేజ్ బాగానే సంపాదించారు. కొంత మంది సినిమాల్లో హీరోలుగా వారి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
1) చమ్మక్ చంద్ర
జబర్దస్త్ కు రాకముందు కూలీగా పనిచేసేవాడట. సాధారణ నిరుపేద అయిన చంద్ర చాలా ఇబ్బందులు పడ్డాడట, తినడానికి తిండి కూడా సరిగా ఉండేదికాదట. ఈ కామిడీ షో కి ముందు వరకు అవకాశాల కోసం చాలా ట్రై చేసేవాడట. ఎంత కష్టపడినా ఆశించినట్టు ఇండస్ట్రీలో అవకాశం రాలేదట. అయితే జబర్దస్త్ కి వచ్చిన తరువాత మాత్రం ఒక్క ఎపిసోడ్ కి మూడున్నర లక్షలు తీసుకునేవాడట. ఇప్పుడు జీ తెలుగులో “అదిరింది” షో చేస్తున్నాడు కాబట్టి రెమ్యూనరేషన్ ఇంకా ఎక్కువగా పెరిగిందట.
2) సుడిగాలి సుధీర్
సుధీర్ అసలు పేరు “సుదీర్ ఆనంద్ భయానా” మే 19 న 1987 లో జన్మించాడు. ఆంధ్రప్రదేశ్, విజయవాడ లో జన్మించాడు. అయితే అకస్మాత్తుగా జరిగిన సంఘటనలలో, అతని తండ్రి ఒక ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. అదే సమయంలో సుధీర్ కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడట. పెద్ద కొడుకు కావడంతో కుటుంబ బాధ్యతలు స్వీకరించి హైదరాబాద్‌కు వచ్చి రామోజీ ఫిలిం సిటీలో మెజీషియన్ గా పనిచేసేవాడట, నెలకు పదివేలు సంపాదనతో జీవితాన్ని గడిపేవాడట. తరువాత జబర్దస్త్ లోకి రావడంతో అతని కష్టాలన్నీ తేరిపోయాయట. అయితే జబర్దస్త్ కి వచ్చిన తరువాత మాత్రం ఒక్క ఎపిసోడ్ కి మూడు నుంచి మూడున్నర లక్షలు తీసుకుంటాడట. అయితే ఇటీవలే ఈ కమీడియన్ హీరో అవతారం ఎత్తాడు ఆ సినిమాకి మాత్రం 30 లక్షలు తీసుకున్నాడని సమాచారం.
3) అదిరే అభి
జబర్దస్త్ కి రావడానికి ముందు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేసాడట. సినిమా ఇండస్ట్రీ మీద మక్కువతో జాబ్ మానేసి వచేసాడట. ఆ తరువాత కొన్ని సినిమాల్లో కూడా పని చేసాడు. జబర్దస్త్ లో ఒక్క ఎపిసోడ్ కి రెండున్నర లక్షలనుంచి మూడు లక్షల వరకు తీసుకుంటున్నాడట.
4) హైపర్ అది
బీటెక్ చేసి మొదట్లో కొన్నాళ్ళు జాబ్ చేసాడట. ఆ తరువాత యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ కూడా తీసాడట. కొద్దిరోజుల తరువాత అదిరే అభి ని ఫేస్బుక్ లో కలిసి అతని ద్వారా జబర్దస్త్ లో కి వచ్చాడట. మొదట్లో అదిరే అభి స్కిట్స్ లో పని చేసి మంచి పేరు తెచ్చుకుని మెల్లగా టీం లీడ్ గా ఎదిగాడు. ఇప్పుడు సుధీర్ లాగా ఒక సినిమాలో హీరోగా నటిస్తున్నాడట. హైపర్ అది జబర్దస్త్ లో ఒక్కో ఎపిసోడ్ కి మూడు నుంచి ఐదు లక్షలు తీసుకుంటాడట.
5) రాకెట్ రాఘవ
రాకెట్ రాఘవ జబర్దస్త్ కి ముందు దూరదర్శన్ స్క్రిప్ట్ రైటర్ గా పనిచేసేవాడట. జబర్దస్త్ లో ఒక్కో ఎపిసోడ్ కి దాదాపు మూడు లక్షలు తీసుకుంటాడట.
6) చలాకి చంటి
చంటి జబర్దస్ కి ముందు ఎఫ్.ఎం రేడియోలో పనిచేసేవాడట. ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించాడు కానీ పెద్దగా క్రేజ్ రాలేదు కానీ జబర్దస్త్ లో మాత్రం బీపత్సమైన క్రేజ్ వచ్చింది. చలాకి చంటి ఒక్కో ఎపిసోడ్ కి రెండు లక్షలు తీసుకుంటాడట.
7) ముక్కు అవినాష్
హోటల్ లో టీ బాయ్ గా పనిచేసేవాడట, కానీ జబర్దస్త్ తరువాత అదే హోటల్ కి గెస్ట్ గా వెళ్లే అంతగా ఎదిగాడు. ఇప్పుడు ఒక్కో ఎపిసోడ్ కి లక్ష రూపాయిలు తీసుకుంటాడట.
8) కిరాక్ ఆర్ఫీ
కిరాక్ ఆర్ఫీ జబర్దస్త్ కి ముందు హోటల్ లో వెయిటర్ గా పని చేసేవాడట. ఇప్పుడు జబర్దస్త్ లో ఒక్కో ఎపిసోడ్ కి లక్ష రూపాయిలు అందుకుంటున్నాడట.
9) ఆటో రాంప్రసాద్
రాంప్రసాద్ గతంలో మెడికల్స్ లో పని చేసాడట. అయితే జబర్దస్త్ లో మాత్రం రైటర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఒక్కో ఎపిసోడ్ కి లక్ష రూపాయిలు తీసుకుంటున్నాడట.
ఎక్కడెక్కడో ఉండే వేళ్ళని జబర్డస్ట్ ఒక చోటికి చేర్చింది. అంతేకాదు వీరి జీవితాల్ని ఊహించనంత విధంగా మార్చేసింది జబర్దస్త్ కామెడీ షో.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…