ప్రపంచ వ్యాప్తంగా కరోనా అల్లకల్లోలం సృష్టిస్తుంది. మనదేశంలో కూడా ఈ కరోనా బాధితుల సంఖ్య ఒక్కసారిగా పెరుగుతోంది. దేశంలో ఇప్పటి వరకు 3577 కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 427 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కరోనా ధాటికి మృతి చెందిన వారి సంఖ్య 83కి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి. మొదట్లో కేసుల సంఖ్య కొంచెం తక్కువ అనిపించినా ఢిల్లీ నిజాముద్దీన్ నుంచి వచ్చిన వారి లింకులు బయటపడటంతో గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఆదివారం నాటికి కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 252గా నమోదయింది. అయితే ఒక్క కర్నూలు జిల్లాలో మాత్రమే 52 కరోనా కేసులు నమోదు అవడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.
కర్నూలు జిల్లాను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ రెండు రోజుల పాటు నిత్యావసరాలు సైతం బంద్ చేయనున్నారు. కర్నూలు జిల్లా కేంద్రంతో పాటుగా నంద్యాల, నందికొట్కూరు, గడివేముల, ఆత్మకూరు, కోడుమూరు, బనగానేపల్లె, పాణ్యం, అవుకు పట్టణాలను కంటోన్మెంట్ జోన్లుగా పరకటించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…