దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకి ఈ మహమ్మారి భారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతుంది. ఈ లాక్ డౌన్ మరికాస్త పెంచే యోచనలో ఉంది కేంద్రం. ఇప్పటికే ఈ మహమ్మారి నివారణ కోసం తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఒక వైపు ప్రజలెవరూ రోడ్ల పైకి రావొద్దని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నారు. చిత్తూరు జిల్లా, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి తీరు మాత్రం తీవ్ర వివాదాస్పదంగా మారింది. కరోనా వైరస్ నివారణ కోసం విరాళాలు ఇచ్చిన వారి ఫోటోలు ట్రాక్టర్లపై పెట్టి భారీ ర్యాలీ చేసారు. దాదాపు 1000 మంది ఈ ర్యాలీలో పాల్గొన్నట్టు సమాచారం. అయితే వీరిలో పోలీసులు, మున్సిపల్ సిబ్బంది కూడా ఉన్నారు. ఈ ర్యాలీ సమయంలో అక్కడి స్థానికులకు నిత్యావసర వస్తువులు అందించారు ఎమ్మెల్యే.
జిల్లాలో కరోనా కేసులు నమోదవుతున్న సమయంలో భాద్యతగా ఉండాల్సిన ఎమ్మెల్యే ఇలా జనాలను సమీకరించి ఇలా భారీ ర్యాలీలు తీయడం సరికాదనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. సాయం చేసిన వారికీ కృతజ్ఞతలు తెలపడం తప్పులేదు కానీ..ఇటువంటి విపత్కర సమయంలో భారీ ర్యాలీ వంటి కార్యక్రమాలు చేయడం సరికాదని అంటున్నారు స్థానికులు. ఇప్పటికే పలు కేసులు నమోదయిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…