Renudesai: దేశంలో కోవిడ్ కేసులు మళ్లీ ఎక్కువ అవుతున్నాయి. కొన్ని రోజుల వరకు రోజుకు కేవలం 10 వేలలోపే ఉన్న కేసులు ప్రస్తుతం లక్షను దాటాయి. మరోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. దీంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తం అవుతున్నాయి.
ఇప్పటికే పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూని విధించాయి. మరికొన్ని రాష్ట్రాలు వీకెండ్ లాక్ డౌన్లను కూడా విధిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాన్ మాజీ భార్య సినీ స్టార్ రేణు దేశాయ్, కొడుకు అఖిరానందన్ కు కరోనా వచ్చింది.
ఈ విషయాన్ని రేణూ దేశాయ్ ఇన్ స్టా ద్వారా వెల్లడించింది. ఇప్పటికే తాను రెండు డోసులు తీసుకున్నా.. అని, త్వరలోనే అఖిరాకు కూడా వ్యాక్సిన్ అందిచాలని అనుకుంటున్న సమయంలో ఇద్దరికి కరోనా సోకిందని వెల్లడించింది. .
తమకు లక్షణాలు తగ్గిపోయాయని.. ప్రజలు కూడా థర్డ్ వేవ్ ను సీరియస్ గా తీసుకోవాలని.. మాస్కులు తప్పకుండా పాటించాలని రేణూ దేశాయ్ సూచించింది. ఇదిలా ఉంటే ఇటీవల వరసగా ఫిలిమ్ స్టార్లు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ లోని ప్రముఖులు కరోనా బారిన పడ్దారు. మహేష్ బాబు, మంచు లక్ష్మీ, మంచు మనోజ్, విక్రమ్, సత్యారాజ్, డైరెక్టర్ ప్రియదర్శన్, సంగీత దర్శకుడు థమన్, త్రిష, సింగర్ లతా మంగేష్కర్ వంటి వారికి కరోనా సోకింది. మరోవైపు రాజకీయ నాయకులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కరోనా సోకగా.. బీహార్ ముఖ్యమంత్రి నితీస్ కుమార్, కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మైకి కరోనా సోకింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కూడా కరోనా సోకిన సంగతి తెలిసిందే.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…