Health News

యాంకర్ రష్మీకి కరోనా పాజిటివ్… షూటింగులు రద్దు..?

బుల్లితెర జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ కు కరోనా నిర్ధారణ అయినట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం సుడిగాలి సుధీర్ కు కరోనా నిర్ధారణ కాగా తాజాగా రష్మీకి కూడా కరోనా సోకిందంటూ వార్తలు రావడం గమనార్హం. వైరల్ అవుతున్న వార్తలు రష్మీ అభిమానులతో పాటు ఆమెతో షోలలో, ఈవెంట్లలో పాల్గొన్న సెలబ్రిటీలను సైతం టెన్షన్ పెడుతున్నాయి. ప్రస్తుతం రష్మీ హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారని తెలుస్తోంది.

అయితే రష్మీకి కరోనా అంటూ వైరల్ అవుతున్న వార్తలపై ఆమె టీమ్ కానీ ఆమె కానీ స్పందించలేదు. కొన్ని రోజుల క్రితం రష్మీ కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నారని..వెలువడిన ఫలితాల్లో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని తెలుస్తోంది. మరోవైపు జబర్దస్త్ షో షూటింగులు క్యాన్సిల్ అయ్యాయని రేపు మరియు ఈ నెల 28వ తేదీన జబర్దస్త్ షో షూటింగులు జరగాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఈ షూటింగులను సైతం వాయిదా వేశారని సమాచారం.

అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నప్పటికీ రష్మీ గౌతమ్ మాత్రం ఈ వార్తల గురించి స్పందించలేక పోవడం గమనార్హం. మరోవైపు రష్మీ ప్రధాన పాత్రలో నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ విడుదల కాగా అవి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే కరోనా సోకడంతో ఈ మూవీ ప్రమోషన్స్ కు సైతం రష్మీ దూరంగా ఉండదనుంది.

సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ సోకుతున్న కరోనా మహమ్మారి సినిమా, టీవీ రంగాలను కుదిపేస్తోంది. ఒక్కరికి వైరస్ సోకినా అప్పటివరకు షూటింగ్ లో పాల్గొన్న వాళ్లంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

“వీధి కుక్కల బెడద పెరుగుతోంది.. ఉమ్మడి మెదక్‌లో వరుస దాడులతో ప్రజల్లో భయం!”

ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…

11 minutes ago

ఆపరేషన్ చేసి కడుపులో కత్తెర మరిచిపోయిన డాక్టర్లు ! ఐదేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్న మహిళ !

ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…

20 minutes ago

విశాఖ సాగరతీరంలో నావికాదళ శక్తి ప్రదర్శన.. బీటింగ్ సెర్మనీతో అబ్బురం!

విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…

29 minutes ago

రాజమౌళి గేమ్ ప్లాన్ రివీల్? సోషల్ మీడియాలో పెరుగుతున్న చర్చలు…

ప్రఖ్యాత దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి మరోసారి తన మార్కెటింగ్ మైండ్‌తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రతి సినిమాకీ ముందుగానే ఖచ్చితమైన…

1 hour ago

బంగారం ధరలో స్వల్ప ఉపశమనం.. ఇవాళ తులం రేటు ఎంతంటే?

కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు ఒకరోజు ఒకలా మారుతూ కొనుగోలుదారులను అయోమయంలోకి నెట్టేస్తున్నాయి. భారీ పెరుగుదల తర్వాత ఒక్కసారిగా…

2 hours ago

విజయ్–రష్మిక పెళ్లి రాజస్థాన్‌లో ఘనంగా.. అతిథులందరికీ ప్రత్యేక నిబంధనలు!

 సినీ పరిశ్రమలో ఆన్‌స్క్రీన్ జంటలు నిజ జీవితంలో ఒక్కటవ్వడం అరుదు కాదు. ఇప్పుడు అలాంటి చర్చల మధ్య నిలిచిన జంటగా…

2 hours ago