బుల్లితెర జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ కు కరోనా నిర్ధారణ అయినట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం సుడిగాలి సుధీర్ కు కరోనా నిర్ధారణ కాగా తాజాగా రష్మీకి కూడా కరోనా సోకిందంటూ వార్తలు రావడం గమనార్హం. వైరల్ అవుతున్న వార్తలు రష్మీ అభిమానులతో పాటు ఆమెతో షోలలో, ఈవెంట్లలో పాల్గొన్న సెలబ్రిటీలను సైతం టెన్షన్ పెడుతున్నాయి. ప్రస్తుతం రష్మీ హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారని తెలుస్తోంది.

అయితే రష్మీకి కరోనా అంటూ వైరల్ అవుతున్న వార్తలపై ఆమె టీమ్ కానీ ఆమె కానీ స్పందించలేదు. కొన్ని రోజుల క్రితం రష్మీ కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నారని..వెలువడిన ఫలితాల్లో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని తెలుస్తోంది. మరోవైపు జబర్దస్త్ షో షూటింగులు క్యాన్సిల్ అయ్యాయని రేపు మరియు ఈ నెల 28వ తేదీన జబర్దస్త్ షో షూటింగులు జరగాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఈ షూటింగులను సైతం వాయిదా వేశారని సమాచారం.

అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నప్పటికీ రష్మీ గౌతమ్ మాత్రం ఈ వార్తల గురించి స్పందించలేక పోవడం గమనార్హం. మరోవైపు రష్మీ ప్రధాన పాత్రలో నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ విడుదల కాగా అవి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే కరోనా సోకడంతో ఈ మూవీ ప్రమోషన్స్ కు సైతం రష్మీ దూరంగా ఉండదనుంది.

సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ సోకుతున్న కరోనా మహమ్మారి సినిమా, టీవీ రంగాలను కుదిపేస్తోంది. ఒక్కరికి వైరస్ సోకినా అప్పటివరకు షూటింగ్ లో పాల్గొన్న వాళ్లంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here