ప్రపంచ దేశాల ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న కరోనా మహమ్మారి గురించి మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. బ్రిటన్‌లోని ఇంపీరియల్ కాలేజ్ లండన్ కు చెందిన శాస్త్రవేత్తలు జలుబులా కరోనా వైరస్ కూడా వచ్చీపోయే అవకాశాలు ఉంటాయని తెలిపారు. వైరాలజిస్టు వెండీ బార్క్‌లే కరోనా మహమ్మారి గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వ్యాప్తి చెందిన కరోనా వైరస్ కు మళ్లీమళ్లీ సోకే లక్షణం ఉందని తెలిపారు.
వాతావరణంలోని మార్పుల వల్ల ప్రతి సంవత్సరం దగ్గు, జలుబు ఏ విధంగా వస్తాయో కరోనా కూడా అదే విధంగా వస్తుందని తెలిపారు. వెండీ బార్క్‌లే బ్రిటన్ లో 3.65 లక్షల మంది ప్రజలకు యాంటీబాడీ పరీక్షలు నిర్వహించి ఈ విషయాలను వెల్లడిస్తున్నామని తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో కొన్ని నెలల పాటే యాంటీ బాడీలు ఉంటాయని గుర్తించామని… యాంటీబాడీలు లేకపోతే మళ్లీ వైరస్ సోకుతుందని చెప్పారు.
కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో 26 శాతం మేర యాంటీబాడీలు తగ్గిపోతాయని గుర్తించామని.. వృద్ధుల్లో త్వరగా యాంటీబాడీలు తగ్గిపోతున్నాయని వెల్లడించారు. కరోనా వైరస్ లక్షణాలు కనిపించని వారిలో 64 శాతం యాంటీబాడీలు తగ్గిపోయినట్టు గుర్తించామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. శాస్త్రవేత్తలు వెల్లడించిన విషయాలు ప్రజల్లో భయాందోళనను అంతకంతకూ పెంచుతున్నాయి.
మరోవైపు భారత్ లో గతంలో నమోదైన కేసులతో పోలిస్తే ప్రస్తుతం నమోదవుతున్న కేసుల సంఖ్య సగానికి తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. మరికొన్ని రోజుల్లో కరోనా పూర్తిగా అదుపులోకి వస్తుందని ప్రజలు భావిస్తున్న తరుణంలో కరోనా మళ్లీమళ్లీ సోకుతుందంటే ప్రజలకు మరిన్ని సమస్యలు తప్పవు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…