General News

వాటి వల్ల కరోనా రానే రాదని చెబుతున్న శాస్త్రవేత్తలు..?

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎక్కడ, ఎప్పుడు, ఎవరి నుంచి సోకుతుందో తెలియని ఈ వైరస్ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. ప్రాణాంతక కరోనా వైరస్ పేరు వింటేనే ప్రజల వెన్నులో వణుకు పుడుతోంది. కరోనా టెన్షన్ తో ప్రజలు వస్తువులను ముట్టుకోవాలన్నా టెన్షన్ పడుతున్నారు. లిఫ్ట్ బటన్స్, మెట్ల రెయిలింగ్ ముట్టుంటే కరోనా సోకుతుందెమోనని భయభ్రాంతులకు గురవుతున్నారు.

 

కరోనా వైరస్ విజృంభించిన తొలినాళ్లలో ఉపరితలాలపై కూడా వైరస్ జీవించే అవకాశం ఉందని.. ఉపరితలాలను ముట్టుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలని లేదంటే వాటిని ముట్టుకున్న తరువాత శానిటైజర్ తో చేతులకు శుభ్రం చేసుకోవాలని శాస్త్రవేత్తలు కీలక సూచనలు చేశారు. గంటల పాటు వస్తువులపై వైరస్ ఉంటుందని తెలియడంతో కొందరు ఆ వస్తువులను కుడా శానిటైజర్ తో శుభ్రం చేయసాగారు.

మరి కొందరు వార్తాపత్రికల ద్వారా కరోనా సోకుతుందని పత్రికలను వేయించుకోవడమే మానేశారు. ఉపరితలాల నుంచి కరోనా సోకుతుందని ఆఖరికి కూరగాయలను కూడా శానిటైజ్ చేసిన వాళ్లు ఉన్నారు. అమెరికాకు చెందిన ప్రొఫెసర్ ‌ గాంధీ మాత్రం ఉపరితలాల నుంచి కరోనా సోకుతుందనడం వట్టి అపోహ మాత్రమేనని వెల్లడించారు. అమెరికా సైన్స్‌ వెబ్‌సైట్‌ ‘నాటిలస్‌’ తో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఉపరితలాలను కరోనా రోగులను తాకినప్పటికీ ఆ ఉపరితలాల నుంచి ఇతరులకు వైరస్ సోకే అవకాశాలు ఒక శాతం కంటే తక్కువని పేర్కొన్నారు. అయితే ఈ అపోహ ప్రజలకు మంచే చేసిందని.. చాలామందికి చేతులను క్రమంగా శుభ్రం చేసుకునే అలవాటును నేర్పించిందని.. కరోనా సోకకుండా ఉండాలంటే భౌతిక దూరం అతి ముఖ్యమైనదని వెల్లడించారు. ‘లాన్‌సెట్‌’ జర్నల్‌ కు ఆయన తన పరిశోధనలకు సంబంధించిన సమాచారం ఇచ్చారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago