రైతులు పండించిన పంటలను కొందరు రైతులు వెంటనే మార్కెట్లో విక్రయిస్తుంటారు. దీంతో వచ్చిన డబ్బులను పెట్టుబడి పెడుతూ మరో పంటను సాగు చేస్తుంటారు. కానీ కొంత మంది పండిన పంటకు గిట్టుబాటు ధర లేకపోతే వాటిని కోల్డ్ స్టోరేజ్ లల్లో దాచుకుంటారు. అయితే ఒక్కోసారి రైతులు పండించిన పంటకు ఎక్కడా లేని ధర పలుకుతుంది.
అలాంటిదే అక్కడ తెల్లబంగారం (పత్తి) పండించిన రైతులకు నిజంగానే బంగారం కురిపించినట్లు అయింది. వాటి ధరలు మాత్రం ఏకంగా ఆకాశాన్ని తాకాయి. కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధరలు ఓ రేంజ్‌లో పెరిగాయి. మార్కెట్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో క్వింటా గరిష్టంగా 8వేల 80రూపాయలు పలికింది. డివిజన్‌లోని ఏరిగేరి గ్రామానికి చెందిన రైతు కిష్టప్ప.. తాను పండించిన పత్తిని ఆదోని వ్యవసాయ మార్కెట్‌కు తీసుకొచ్చారు.
ఆ రైతుకు చెందిన పత్తి గరిష్టంగా క్వింటారూ. 8వేల 80రూపాయలకు వ్యాపారి కొనుగోలు చేసినట్లు యార్డు కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. రికార్డ్ స్థాయి ధరలు ఖరీఫ్ సాగుకు ముందు పలుకుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాపారుల మధ్య పోటీ కారణంగానే ఇలా రోజు రోజుకూ ధరలు పెరుగుతున్నాట్లు చెబుతన్నారు.
రైతుల వద్ద కొత్త దిగుబడుల నిల్వలు లేకపోవడం పరిశ్రమలకు అవసరమైన పత్తి లేకపోవడంతో వ్యాపారుల మధ్య పోటీ పెరిగి ధరలు పెరగడానికి కారణమైంది. నేటి వరకు పంటను దాచుకున్న రైతులు ధరలు పెరగడంతో మార్కెట్ కు తీసుకొస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…