దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత అధికంగా ఉండటం వల్ల వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన ఆంక్షలను విధిస్తూ కరోనాను కట్టడి చేయడానికి కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే లాక్ డౌన్ సమయంలో ఎలాంటి శుభకార్యాలకు అనుమతి ఇవ్వడం లేదు. కేవలం పెళ్లి, చావు వంటి వేడుకలకు కేవలం కొంత మంది సమక్షంలో మాత్రమే జరగాలని అధికారులు సూచించారు. ఈ క్రమంలోనే ఎన్నో జంటలు లాక్ డౌన్ సమయంలో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా వివాహాలు జరిపించారు. ఈ క్రమంలోనే ఓ జంట ఏకంగా కోవిడ్ కేర్ సెంటర్ నే వివాహ వేదికగా చేసుకొని పెళ్లి చేసుకున్నారు. ఈ జంట ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి కారణం తెలిస్తే ప్రతి ఒక్కరు మెచ్చుకోకుండా ఉండలేరు.
ప్రస్తుతం మహారాష్ట్రలో కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపును ప్రకటించింది. ఈ క్రమంలోనే వివాహ వేడుకలకు విధించిన ఆంక్షలను కూడా సడలించారు.దీంతో పార్నర్ పట్టణానికి చెందిన రెండు జంటలు కోవిడ్ సెంటర్‌లో వివాహం చేసుకొని ఒక్కటైన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఎంతో పెద్ద చదువులు చదివిన ఈ జంటలుఎంతో ఘనంగా తమ పెళ్లిని చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని భావించి తమ పెళ్లి ఖర్చులన్నీ పూర్తిగా తగ్గిస్తూ ఎంతో నిరాడంబరంగా కోవిడ్ కేర్ సెంటర్ లో పెళ్లి చేసుకుని, పెళ్లికి అయ్యే ఖర్చునంతటిని ఆ కోవిడ్ కేర్ సెంటర్ కు విరాళంగా ప్రకటించారు.స్థానిక ఎమ్మెల్యే నీలేష్ లంకకు చెందిన శరద్ చంద్రజీ పవార్ ఆరోగ మందిర్ కోవిడ్ సెంటర్‌లో ఈ జంట వివాహం చేసుకున్నారు.
ఈ విధంగా కోవిడ్ కేర్ సెంటర్ లో అనికేత్ వ్యవహరే, ఆర్తి షిండే…రాజశ్రీ కాలే, జనార్దన్ అనే రెండు జంటలు మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. ఈ క్రమంలోనే వారి పెళ్లి ఖర్చులు తగ్గించడం వల్ల ఆ డబ్బులతో మాస్కులు, శానిటైజర్ లు, పీపీఈ కిట్లు మందులు కొనుగోలు చేసి ఇవ్వడమే కాకుండా .37000 ఆర్థిక సహాయం కూడా అందించారు. ఈ క్రమంలోనే ఈ జంటలు మాట్లాడుతూ తాము అక్కడ పెళ్లి చేసుకోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి కరోనా బాధితులకు ఎంతో ధైర్యం కలుగుతుందని, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ఈ విపత్కర పరిస్థితులలో కొంతవరకు తమ వంతు సాయం ప్రకటించినట్లు అవుతుందని ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు.ఈ విధంగా ఈ యువకులు కోవిడ్ కేర్ సెంటర్ లో పెళ్లి చేసుకోవడం వల్ల ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్ల చేత ప్రశంశలు అందుకున్నారు.
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…