Actress Hema: బెంగళూరు రేవ్ పార్టీలో భాగంగా సినీనటి హేమ అరెస్ట్ అయిన సంగతి మనకు తెలిసిందే .ఇలా ఈమె ఈ పార్టీలో పాల్గొనటమే కాకుండా డ్రగ్స్ కూడా తీసుకున్నారనే విషయం తెలియడంతో పోలీసులు ఈమెను అరెస్టు చేశారు. మే 20వ తేదీ ఈ పార్టీలో భాగంగా పలువురు సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు.
ఈ పార్టీలో భారీ స్థాయిలో డ్రగ్స్ ఉపయోగించారు అనే విషయం తెలియడంతో పోలీసులు రైడ్ చేశారు. ఇక ఈ పార్టీలో ఈమె పాల్గొనడంతో పోలీసులు తనకు రక్త పరీక్షలు నిర్వహించగా అందులో డ్రగ్ తీసుకున్నట్లు రావడంతో విచారణకు హాజరు కావాలనీ ఆమెకు నోటీసులు పంపినప్పటికీ విచారణకు రాకపోవడంతో పోలీసులు తనని అరెస్టు చేశారు.
ఈనెల 14వ తేదీ వరకు రిమాండ్ పొడిగించినప్పటికీ ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ప్రస్తుతం జ్యూడిషియల్ కస్టడీలో భాగంగా పరప్ప అగ్రహార జైలులో ఉన్న ఆమెకు బుధవారం బెయిలు మంజూరు అయింది.బెంగళూరు రూరల్ ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టు హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
షరతులతో కూడిన బెయిల్..
హేమ నుంచి ఎలాంటి డ్రగ్స్ లభించలేదని, చాలా రోజుల తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించామని హేమ తరఫు న్యాయవాది మహేష్ కిరణ్ శెట్టి వాదించారు.దీంతో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయాలని కోర్టు ఆదేశించింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…