General News

చెస్ట్ సిటీ స్కాన్ ఎప్పుడు అవసరమో తెలుసా?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు అధికమవుతున్న నేపధ్యంలో ప్రతి ఒక్కరూ ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.కొందరిలో కొద్దిగా లక్షణాలు మొదలవగానే వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకొని జాగ్రత్త వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కరోనా నిర్ధారణ పరీక్షల కోసం ర్యాపిడ్ టెస్ట్, ఆర్టీపీసీఆర్ టెస్టులు అందుబాటులో ఉన్న సంగతి మనకు తెలిసిందే.కానీ కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే ప్రతి ఒక్కరు నిర్ధారణ కోసం సిటీ స్కాన్ చేయించడం కోసం పరుగులు తీస్తున్నారు.అయితే మాటిమాటికి సిటీ స్కాన్ చేయించుకోవటం వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ తో బాధపడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు.

చాలామంది తమకు కరోనా లక్షణాలు కనిపించిన టెస్టులలో నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన వెంటనే సిటీ స్కాన్ చేయించుకుంటున్నారు.లక్షణాలు కనిపించిన వెంటనే సిటి స్కాన్ చేయించుకోవటం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు.అప్పటికి ఈ వైరస్ మన ఊపిరితిత్తులలో లోడ్ కాకపోవటం వల్ల మనకు ఫలితాలలో ఎటువంటి రిజల్ట్ కనపడదు. రెండు మూడు రోజుల తర్వాత వైరస్ ఊపిరితిత్తులకు చేరి తీవ్రమైన శ్వాసకోశ సమస్యలను, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఎదురవుతాయి అలాంటి సమయంలో మరోసారి చేయించుకుంటారు. ఈ విధంగా పలుమార్లు సిటి స్కాన్ చేయించుకోవటం వల్ల మన శరీరం అధిక రేడియేషన్ కి గురవుతోందని వైద్యులు సూచిస్తున్నారు. మరి సిటి స్కాన్ ఎప్పుడు అవసరం? ఎవరు చేయించుకోవాలి అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం…

ఆర్టీపీసీఆర్‌లో కోవిడ్ నెగటివ్ వచ్చి.. తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా చెస్ట్ సిటీ స్కాన్,చెస్ట్ ఎక్స్‌రే అవసరమవుతుంది.అదేవిధంగా కరోనా బారినపడి ఆరోగ్యం బాగా క్షీణించినట్లయితే అలాంటి వారి ఊపిరితిత్తులలో వైరస్ తీవ్రత ఎంత ఉందో తెలుసుకోవడం కోసం సిటీ స్కాన్ అవసరమవుతుంది.

ఇతర ఊపిరితిత్తుల సమస్యతో బాధపడేవారికి డాక్టర్లు సిటి స్కాన్ సిఫార్సు చేస్తారు. కొందరిలో వ్యాధి తీవ్రత అధికంగా ఉన్నప్పుడు వారిలో ఆక్సిజన్ స్థాయిలు పూర్తిగా పడిపోయి ఊపిరితిత్తులు బాగా కుచించుకు పోతాయి.అలాంటి వారిలో వైరస్ తీవ్రతను కనుక్కోవడం కోసం డాక్టర్లు సిటీ స్కాన్ సిఫార్సు చేస్తారు. వయసు పై పడి షుగర్ బీపీ వంటి సమస్యలతో బాధపడే వారికి కూడా సిటిస్కాన్ అవసరమవుతుంది. ఈ విధమైనటువంటి సమస్యలతో బాధపడే వారు మాత్రమే డాక్టర్ల సూచన మేరకు సిటి స్కాన్ చేయించుకోవాలి. ఎటువంటి కరోనా లక్షణాలు లేకుండా సిటి స్కాన్ చేయించుకోవడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు.ఈ విధంగా పదేపదే సిటీ స్కాన్ చేయించుకోవడం వల్ల మన శరీరం పై అధిక రేడియేషన్ కలిగి భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago