సాధారణంగా కొందరు తీసుకునే నిర్ణయాలు విచిత్రంగా ఉంటాయి. తొందరపాటు తనం వల్ల ఎవరూ ఊహించనటువంటి నిర్ణయాలు తీసుకొని క్షణాలలో ఆ నిర్ణయాన్ని మార్చేస్తుంటారు. ఈ విధంగా స్థిరత్వం లేని నిర్ణయాలు వల్ల జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న వారిలో ఉత్తరప్రదేశ్ కి చెందిన ఈ ప్రేమజంట ఒకటి. వీరి ప్రేమ వ్యవహారంలో ఉన్న ట్విస్ట్ ల గురించి తెలిస్తే ప్రతి ఒక్కరూ ఎంతో ఆశ్చర్యానికి గురి అవుతారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్‌లోని హమీపూర్ జిల్లాలోని గల మౌదాహాలో నివసిస్తున్న ఓ యువతి తన క్లాస్‌మేట్ సందీప్ అనే వ్యక్తి గత రెండు సంవత్సరాల నుంచి ప్రేమిస్తుంది. ఇంట్లో వారికి తెలియకుండా ఇద్దరు కొన్ని రోజులపాటు ప్రేమ కథను నడిపించారు. చివరికి యువతి ఇంట్లో విషయం తెలియడంతో ఆమె తల్లిదండ్రులు తనని మందలించారు. ఎలాగైనా సందీప్ కి బుద్ధి చెప్పాలని భావించిన యువతి తల్లిదండ్రులు ఆమెను బలవంతంగా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళి సందీప్ తనని లైంగికంగా లోబరుచుకున్నాడని బలవంతంగా పోలీసులకు ఫిర్యాదు చేయించారు.
ఈ విధంగా యువతీ ఫిర్యాదు చేయడంతో పోలీసులు సందీప్ ను కస్టడీలోకి తీసుకున్నారు.సందీప్ అరెస్టయ్యాడనే విషయం తెలుసుకున్న ఆ యువతి పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన తల్లిదండ్రులు తన చేత బలవంతంగా ఫిర్యాదు చేయించారని సందీప్ ని వదిలి పెట్టాలని వేడుకుంటూ తన ఫిర్యాదును వెనక్కి తీసుకుంది. ఈ క్రమంలోనే సందీప్ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి వారిద్దరికీ వివాహం చేయాలని కోరింది.
ఆ యువతి కోరిక మేరకే సందీప్ తల్లిదండ్రులు ఇద్దరికీ గుడిలో వివాహం చేశారు.తదుపరి ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఆమె ఏమనుకుందో ఏమో.. తన నిర్ణయాన్ని మార్చుకుని పెళ్లయిన 12 గంటలకి పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించి తనకు ఇష్టం లేకుండానే బలవంతంగా పెళ్లి చేశారని ఆరోపించింది. దీంతో పోలీసులు సందీప్ నిర్ణయం అడగగా అందుకు సందీప్ తనతో విడిపోవడానికి నిర్ణయించుకున్నారు.ఈ క్రమంలోనే సందీప్ మాట్లాడుతూ నిలకడలేని నిర్ణయాలు తీసుకొని మనస్తత్వమున్న తనతో ఎంతగానో విసిగిపోయాను. తనను ఎంతగానో ప్రేమించాను.. కానీ తనకు ఏం కావాలో తనకే తెలియదు అందుకే అలాంటి వ్యక్తితో జీవించడం కన్నా విడిపోవడమే మంచిదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సందీప్ తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…