Featured

CVL Narasimharao : లాయర్ అయ్యుండి కూడా చిరంజీవి గారి సినిమాలో మోసపోయాను : నరసింహారావు

CVL Narasimharao : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించిన తెలుగు నటుడు నరసింహారావు గారు ఆయన జీవితంలో ఎదుర్కొన్న వివిధ విషయాల గురించి రీసెంట్ గా యూట్యూబ్ లో ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన వృత్తి పరంగా లాయర్ అయినా సినిమాల్లో ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్నారు. ఇక లాయర్ అయ్యుండి కూడా కొన్నిసార్లు మోసపాయాను డబ్బు విషయలో అలాగే ఎదుటివారి ఆలోచన పసిగట్టడం లో మోసపోయాను అంటూ చెప్పారు. వెంకీ, జాతిరత్నాలు, ఠాగూర్, యువసేన వంటి ఎన్నో సినిమాల్లో నటించారు.

ఠాగూర్ సినిమాలో అలా మోసం చేసారు…

చిరంజీవి గారు హీరోగా లంచగొండితనం మీద వచ్చిన సినిమా ‘ఠాగూర్’. సమాజానికి మేల్కొల్పు లాగా వచ్చిన ఈ సినిమా మంచి హిట్ అయింది. అలాగే చిరంజీవి గారికి రాజకీయాల్లోకి వెళ్ళడానికి ఒకరకంగా ఈ సినిమా కారణం అయింది. ఇక సినిమా విషయంలో జరిగిన ఒక సంఘటన గురించి నరసింహారావు గారు వివరించారు. సినిమాలో నటించడం వల్ల అప్పటికే సమాజానికి ఉపయోగపడే ఏవో ఒక కార్యక్రమాలు చేస్తున్న నరసింహారావు గారు ఈ సినిమా ద్వారా కూడా ఏదైనా చేయాలని అనుకోని లంచగొండితనాన్ని అరికట్టేందుకు ఒక వెబ్ సైట్ ను మాజీ డీజిపి వంటి వారి సహాయం తో చేసారు. అయితే సినిమా విడుదల అయిన మొదటి రోజే సినిమా హిట్ అయిందని తెలిసాక ఆ సినిమా నిర్మాతలు ఆ వెబ్ సైట్ కోసం అంతవరకూ ప్రోత్సాహం ఇచ్చారు. ఇక సినిమా హిట్ అవ్వగానే వెబ్ సైట్ ను వదిలేసారు.

ఏమని అడిగితే సినిమాకు పబ్లిసిటీ వస్తుందని వెబ్ సైట్ పెట్టాము ఇక సినిమా హిట్ అయింది కదా ఇంకెందుకు వెబ్ సైట్ అంటూ మాట్లాడారు. అంటే సినిమా హిట్ అవ్వడానికి దోహద పడుతుందని వెబ్ సైట్ కి సహాయం చేసారా ఇలా కూడా మోసం చేస్తారా అనిపించింది. శర్వానంద్ నటించిన స్రవంతి రవికిశోర్ యువసేన సినిమాలో కూడా ఇలాగే జరిగింది. కాకపోతే ఇక్కడ సినిమా ప్లాప్ అవడంతో ఇంకా వెబ్ సైట్ ఎందుకు సినిమానే పోయినపుడు అన్నారు. అలా లాయర్ అయ్యుండి ఈ రెండు సందర్భాల్లోనూ వాళ్ళ ఇంటెన్షన్స్ కనుక్కోలేకపోయాను అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago