వంశపారంపర్యంగా వచ్చే తండ్రి ఆస్తిపాస్తులే కాదు. మందు బాటిల్స్ ను ఆస్తిగా ఇచ్చినా సంతోషంగా స్వీకరించాలి. ఎందుకంటే అవి కూడా ఆస్తితో సమానం కాబట్టి.! అవి ఆస్తితో సమానమేమిటి.? వాటితో తాగడం తందనాలాడటం తప్ప అంతకు మించి ఏం చేస్తాం అనుకోకండి. వాటితో ఇళ్లు కొనుగోలు చేయవచ్చు. ఏంటి నమ్మలేకపోతున్నారా.? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం.! ఇందుకు ఉదాహరణగా ఓ తండ్రి ఇచ్చిన మందుబాటిళ్లను దాచుకొని ఓ కొడుకు కొత్తగా ఓ ఇంటిని కొనుగోలు చేశాడు. ఆశ్చర్యంగా ఉంది కదూ.. అయితే మీరు ఆ తండ్రీ, కొడుకుల వివరాలను తెలుసుకోవాలంటే.. మొత్తం స్టోరీ చదవాల్సిందే..!
1992లో న్యూయార్క్ లో పీట్ రాబ్సన్ అనే వ్యక్తికి మాథ్యూ జన్మించాడు. ఇంట్లో పిల్లలు పుట్టినప్పుడు వారి తలకు విస్కీ రాయడం వాళ్ళ ఆనవాయితీ. ఆవిధంగా మాథ్యూ తలకు విస్కీ రాసేందుకు తెచ్చే మందు బాటిల్ తో పాటు ప్రతి పుట్టినరోజు నాడు మాథ్యూకి ఒక విస్కీ బాటిల్ కానుకగా ఇచ్చేవాడు తండ్రి. లేటెస్టుగా మాథ్యూకి 28 ఏండ్లు పూర్తయ్యాయి. తండ్రి ఇచ్చిన విస్కీ బాటిల్స్ కూడా 28కు చేరాయి. తండ్రి ఇచ్చిన మందును కొడుకు తాగకుండా భద్రంగా దాచుకున్నాడు. అయితే ఈమధ్య మాథ్యూకి ఓ ఇల్లు కొనుగోలు చేయాలనే మంచి ఆలోచన వచ్చింది. కానీ అతని వద్ద అంత డబ్బు లేదు. ఏం చెయ్యాలా.? అని ఆలోచిస్తున్న టైములో అప్పుడే ఒక సూపర్ ఐడియా మాథ్యూకి తట్టింది.
తన తండ్రి కానుకగా ఇచ్చిన విస్కీ బాటిల్స్ ను అమ్మితే ఎంత వస్తుందో అని ఆసక్తిగా తెలుసుకున్నాడు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఆ 28 విస్కీ బాటిల్స్ ఖరీదు అప్పట్లోనే 5 లక్షలు ఉండేదంట. ఇప్పడు వాటి ధర రూ. 40 లక్షలు ఉంటుందని తెలియడంతో మాథ్యూ ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆనందంగా ఆ 28 విస్కీ బాటిల్స్ ని అమ్మి వచ్చిన డబ్బుతో ఇల్లు కొనేశాడు మాథ్యూ. అదండీ సంగతి.. కాబట్టి తండ్రి ఏ కానుక ఇచ్చినా అది మన శ్రేయస్సుని కోరేవిధంగానే ఉంటుందని అర్ధమైంది కదూ..!
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…