Categories: FeaturedMovie News

టీవి నటి శ్రావణి సూసైడ్ కేసులో క్రొత్త మలుపు – లీకైన RX సినిమా నిర్మాత ఫోన్ సంభాషణ !!

‘మనసు మమత’, ‘మౌనరాగం’ సీరియల్స్ లో నటించిన బుల్లితెర నటి శ్రావణి సూసైడ్ కేసు క్రొత్త మలుపులు తిరుగుతోంది. ఈ కేసుతో తనకెలాంటి సంబంధం లేదని వాదిస్తూ వచ్చిన దేవరాజు రెడ్డికి సంబంధించిన అడియో క్లిప్ బయటికి రావడంతో పాటు సోషల్ మీడియాలో ఆ ఆడియో ఇప్పుడు వైరల్ గా మారంది. దీంతో అతని వేధింపులే శ్రావణి ఆత్మహత్యకు కారణమా.? అన్న అనుమానాలు బలపడుతున్నాయి.

నటి శ్రావణి సూసైడ్ కేసును విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు కూడా ఇప్పటికే కొన్ని ప్రాథమిక సాక్ష్యాలను కూడా సేకరించినట్లు తెలుస్తోంది. ప్రేమ పేరుతో దగ్గరైన వ్యక్తి బెదిరింపులకు మానశిక అందోళనకు గురైన శ్రావణి ఈ విపరీత నిర్ణయానికి పాల్పడిందా.? అన్నది పోలీసులు దర్యాప్తులో తేలాల్సి వుంది. అయితే దేవరాజ్ అరోపణలు చేసిన సాయి కృష్ణారెడ్డి కూడా స్పందించాడు. తనపై దేవరాజ్ రెడ్డి చేసిన అరోపణలన్నీ అబూత కల్పనలని తోసిపుచ్చాడు, ఈ మేరకు ఆయన ఓ వీడియోను మీడియాకు విడుదల చేశాడు. శ్రావణి కుటుంబానికి తాను ఫ్రెండ్ ని మాత్రమేనని అన్నాడు. బంగారు భవిష్యత్తు వున్న శ్రావణి జీవితాన్ని కాపాడేందుకు ప్రయత్నించానని తెలిపాడు. అమె సూసైడ్ చేసుకున్నప్పటి నుంచి అమె తల్లిదండ్రులతోనే వున్నానని, చెట్టంత కూతుర్ని కోల్పోయిన అమె తల్లిదండ్రులను ఓదార్చుతున్నానని చెప్పాడు. దేవరాజ్ రెడ్డి అరోపించినట్లుగా తాను ఎక్కడికీ పారిపోలేదని స్పష్టం చేశాడు. శ్రావణి కుటుంబంతో తనకు మంచి అనుబంధం వుందన్న ఆయన అమె ఆత్యహత్యకు తాను ఎట్టి పరిస్థితుల్లోనూ కారణం కాదని చెప్పాడు.

ఇదిలావుండగా, ఈ కేసులో మృతురాలు శ్రావణికి, దేవరాజు రెడ్డికి మద్య సాగిన సంభాషణ ఆడియో టేపులో దేవరాజ్ శ్రావణిని బెదిరించినట్టు వుంది. తనతో మర్యాదగా వచ్చి గంట సమయాన్ని గడపాలని లేకపోతే తర్వాత జరిగే పరిణామాలకు తాను బాధ్యుడ్ని కాదని హెచ్చరించినట్లు వుంది. ఈ క్రమంలో శ్రావణికి, ఆర్ఎక్స్ సినిమా నిర్మాత అశోక్ రెడ్డికి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ లీకైంది. ఈ సంభాషణ ప్రకారం.. దేవరాజురెడ్డి వేధింపుల గురించి శ్రావణికి, అశోక్ రెడ్డికి మధ్య సంభాషణ సాగినట్లు అర్థమవుతోంది. రాజీకి రావాలని దేవరాజు రెడ్డి అడగడంపై ఆ సంభాషణ సాగింది. రాజీకి తాను సిద్ధమేనని, అయితే పోలీసుల నుంచి ఫోన్ వస్తే తాను వస్తానని చెప్పానని శ్రావణి అశోక్ రెడ్డితో అన్నట్లు ఫోన్ సంభాషణల ద్వారా తెలుస్తోంది. దేవరాజు మీద శ్రావణి కేసు పెట్టిన నేపథ్యంలో ఆ సంభాషణ సాగింది. ఇదిలావుంటే, దేవరాజు రెడ్డి ఎస్సార్ నగర్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యాడు. శ్రావణి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago