Daggubati Raja: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోను రాజకీయాలలో వారసుల పరంపర కొనసాగడం సర్వసాధారణం. ఇలా ఎంతో మంది సినీ వారసులు రాజకీయ వారసులు ఇండస్ట్రీలోకి వచ్చి కొనసాగుతూ ఉంటారు. అయితే కొంతమంది ఆ రంగాలలో పెద్దగా రాణించలేక తిరిగి సినీ రంగానికి,రాజకీయ రంగాలకు దూరమవుతూ ఇతర వ్యాపారాలలో స్థిరపడి ఉంటారు.
ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో దగ్గుబాటి కుటుంబానికి ఎంతో మంచి క్రేజ్ ఉంది. దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా ఇండస్ట్రీలోకి సురేష్ బాబు వెంకటేష్ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం రానా కూడా హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు అయితే ఈ కుటుంబం నుంచి హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చి తెలుగులో కన్నా తమిళంలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీకి దూరమైన హీరో ఉన్నారు. మరి అతను ఎవరు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనే విషయానికి వస్తే…
దగ్గుబాటి రామానాయుడు అన్నయ్య కుమారుడే దగ్గుబాటి రాజా. ఈయన భారతీయ రాజ వద్ద శిక్షణ తీసుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. చూడగానే ఆకట్టుకొని రూపంతో ఉన్నటువంటి రాజా తన నటనతో ఎన్నో అద్భుతమైన తమిళ సినిమాలలో నటించి నటుడిగా ఎంతో మంచి గుర్తింపు పొందారు. తెలుగులో రాజా హీరోగా సిరిపురం చిన్నోడు, ఝాన్సీ రాణి, చిన్నారి స్నేహం, వనిత, వంటి పలు సినిమాలలో నటించారు అయితే ఉన్నఫలంగా ఈయనకు అవకాశాలు రాలేదు.
అవకాశాలు లేని సమయంలో తన బాబాయ్ రామానాయుడు దగ్గరకు వెళ్లి ఉంటే ఇండస్ట్రీలో హీరోగా కొనసాగే వారు కానీ అలా చేయకుండా చెన్నై వెళ్లి తన తండ్రి నిర్వహిస్తున్నటువంటి గ్రానైట్ వ్యాపారాలు చూసుకుంటూ బిజీగా మారిపోయారు.ప్రస్తుతం తన భార్య బిడ్డలతో కలిసి చెన్నైలోనే నివాసం ఉంటున్నారు. ఇక ఏదైనా దగ్గుబాటి ఇంట శుభకార్యాలు జరిగితే ఈయన రామానాయుడు ఫ్యామిలీలో కనిపిస్తూ సందడి చేస్తుంటారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…