తన ప్రేమకు అడ్డు వస్తుందనే కోపంతో కన్నతల్లిని ఓ యువతి ప్రియుడితో కలిసి అత్యంత దారుణానికి పాల్పడింది. కన్న తల్లి అనే కనికరం లేకుండా.. ఏ మాత్రం జాలీ, దయ లేకుండా గొంతు నులిపి చంపేశారు. ఈ ఘటన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చింతల్ మెట్ లో నివసిస్తున్న నందిని అదే ఏరియాలో నివాసం ఉంటున్న చోటూ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. తర్వాత ప్రేమగా మారింది. వారిద్దరు ఒకరినొకు కలుసుకోవడం.. బయటకు వెళ్లడం.. ఫోన్ లో మాట్లాడుకోవడం చూసి ఆ యువతి తల్లి మందలించింది.
కూతురు వ్యవహారం నచ్చకపోవడంతో తల్లి యాదమ్మ కుమార్తె నందినిని ప్రశ్నించింది. ఆమె అడిగిన ప్రశ్నలకు ఆ యువతి సమాధానం చెప్పలేక పోయింది. ఇలా వాళ్లిద్దరు మాట్లాడుకోవడం.. మధ్యలో ఆమె తల్లి వచ్చి మందలించడంతో.. తమ ప్రేమకు అడ్డు వస్తుందని భావించింది.
దీంతో ఎలాగైనా తన తల్లిని అడ్డు తొలగించుకోవడానికి పథకం వేసింది. అనుకున్నట్లు గానే ప్రియుడిని ఇంటికి రప్పించి తల్లి గొంతు నులిపి చంపేశారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్ మెట్ లో దారుణం చోటు చేసుకుంది.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…