Deepika Padukone: దీపికా పదుకొనే ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ తన ప్రెగ్నెన్సీ టైం ఎంతో సంతోషంగా స్పెండ్ చేస్తూ ఉన్నారు. ఈమె ఇటీవల నటించిన కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా దీపిక బేబీ బంప్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.
2018 వ సంవత్సరంలో నటుడు రణవీర్ సింగ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈమె ఈ ఏడాది తల్లి కాబోతున్నారు. ఇలా తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా ఇలా తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని తెలియజేస్తూ ఈమె ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేశారు.
పర్పుల్ కలర్ డిజైనర్ శారీలో ఉన్న ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ చీరలో తన బేబీ బంప్ క్లియర్ గా కనిపించడంతో ఈ ఫోటోలు మరింత వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోలు అనంత అంబానీ రాధిక మర్చంట్ సంగీత్ వేడుకలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారడంతో అభిమానుల దృష్టి మొత్తం ఆమె ధరించిన చీర పై పడింది.
1.92 లక్షలు..
స్పెషల్ డిజైనర్ తో డిజైన్ చేయించిన ఈ చీర చూడటానికి ఎంతో అద్భుతంగా ఉంది. అయితే ఈ చీరలో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయని తెలుస్తోంది. చీర యొక్క ఫాబ్రిక్ ఆర్గాన్జా మరియు జెన్నీ సిల్క్ చే తయారుచేయబడింది. అంతేకాదు ఈ చీర చేతితో ఎంబ్రాయిడరీ చేయగా..దీని తయారీకి దాదాపు 3,400 గంటలు పట్టింది.అందమైన చీరలో ముత్యాలు, జరీ మరియు తీగల అలంకరణలు ఎన్నో ఉన్నాయి. ఇలా భారీ స్థాయిలో డిజైన్ చేసిన ఈ చీర ఖరీదు ఏకంగా లక్ష 92,000 అని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అంతర్జాతీయ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రేసులో ఉన్న పాకిస్థాన్ జట్టుకు ఐసీసీ నుంచి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి…
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో 33 ఏళ్ల త్విషా శర్మ అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. కేవలం ఐదు నెలల క్రితమే…
తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత మరోసారి రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించే వ్యాఖ్యలు…
వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు కేవలం నివాస స్థలం మాత్రమే కాదు, అది శక్తి ప్రవాహం జరిగే ప్రదేశంగా కూడా…
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ ఆలయం త్వరలో హైటెక్ మార్పులకు సిద్ధమవుతోంది. భక్తులకు మరింత సులభంగా, వేగంగా దర్శనం…
దేశంలో నిత్యావసరాల ధరలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడంతో కేంద్రం పెట్రోల్,…