Movie News

రీసెంట్ గా బ్రేకప్ అయ్యింది.. గుండెల్లో బాధ బయటపెట్టిన విజయ్ దేవరకొండ?

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నాడు. అయితే విజయ్ దేవరకొండ నటించిన సినిమాలు ఎక్కువగా సక్సెస్ సాధించడంతో విజయ్ పాన్ ఇండియా సినిమాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నాడు.

హీరో విజయ్ దేవరకొండ ఇటీవలె తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన పుష్పకవిమానం సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే త్వరలోనే ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో దేవరకొండ బ్రదర్స్ ప్రమోషన్స్ లో బిజీ బిజీ అయిపోయారు.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ ఎవరికి తెలియని పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

విజయ్ దేవరకొండ ఎవరితోనైనా డేటింగ్ లో ఉన్నారా? లేక సింగిలా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ మధ్యనే నా హార్ట్ బ్రేక్ అయింది. ఆ విషయం గురించి ఎవరికీ తెలియదని విజయ్ తెలిపాడు. ఇక విజయ్ దేవరకొండ ఆ మాట సరదాగా,చెప్పాడా లేక నిజంగానే బ్రేకప్ అయిందా అనేది అభిమానులు అర్థం కావడం లేదు. బ్రేకప్ అయితే ఆ అమ్మాయి ఎవరు అని ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు.

ఈ విషయంపై విజయ్ డేటింగ్ చేసిన అమ్మాయి ఎవరు అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలని కోరుకుంటున్నారు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే.మరొకవైపు ఆనంద్ దేవరకొండ తాను ఇంకా సింగిల్ అంటూ రిలేషన్ షిప్ స్టేటస్ పై క్లారిటీ ఇచ్చేశాడు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పుట్టుమచ్చల రహస్యం: ఈ చోట్ల ఉంటే సంపద, సౌఖ్యం మీవే!

పుట్టుమచ్చలు అంటే సాధారణంగా శరీరంపై కనిపించే చిన్న గుర్తులు మాత్రమే అని చాలామంది భావిస్తారు. అయితే భారతీయ సంప్రదాయాల్లో, ముఖ్యంగా…

6 minutes ago

ఎండలో బయటికి వెళ్లగానే తలనొప్పి వస్తుందా? ఇది సాధారణం కాదు… శరీరం ఇస్తున్న హెచ్చరిక!

వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో బయట అడుగు పెట్టడమే కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో చాలామందిని వేధిస్తున్న…

56 minutes ago

పెళ్లి తర్వాత తొలి బర్త్‌డే… కూర్గ్‌లో రష్మిక సెలబ్రేషన్స్

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తన 30వ పుట్టినరోజును ఎంతో ప్రత్యేకంగా జరుపుకున్న విధానం అభిమానులను ఆకట్టుకుంటోంది. పెళ్లి తర్వాత…

1 hour ago

నమ్మాలా? వదిలేయాలా? ఈ ప్రాంతాలపై ప్రజల్లో భయం ఎందుకు?

భారతదేశంలో ఆధ్యాత్మిక విశ్వాసాలు, సంప్రదాయాలు ఎన్నో రూపాల్లో కనిపిస్తాయి. దేవాలయాలు, పుణ్యక్షేత్రాలతో పాటు కొన్ని ప్రదేశాలు రహస్య ఆచారాలు, తాంత్రిక…

1 hour ago

13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బంద్? ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిల్లల డిజిటల్ భద్రతపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. 13 ఏళ్లలోపు పిల్లలను సోషల్…

1 hour ago

కామాక్షి దీపం: ఇంటి పూజలో ప్రత్యేక స్థానం… సరైన విధానం తెలిసి వెలిగిస్తేనే ఫలితం

హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీపం అనేది కేవలం వెలుగు మాత్రమే కాదు, అది లక్ష్మీదేవి…

1 hour ago