Dhaggubati Abhiram : దగ్గుబాటి ఇంటి నెక్స్ట్ జనరేషన్ వారసుడిగా సినిమాల్లోకి హీరోగా అడుగుబెట్టిన మరో నటుడు సురేష్ బాబు తనయుడు దగ్గుబాటి అభిరామ్. ఇప్పటికే బాబాయ్ వెంకటేష్ నట వారసత్వాన్ని అన్న రానా సినిమాల్లో తానేంటో నిరూపించుకోగా ఇక ఇప్పుడు అభిరామ్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తేజ డైరెక్షన్ లో ‘అహింస’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. అయితే సినిమాల్లోకి ఇంకా అడుగుపెట్టక ముందే దగ్గుబాటి అభిరామ్ ఒకానొక సందర్భంలో బాగా వైరల్ అయ్యాడు. సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి సెన్సేషన్ క్రియేట చేసిన శ్రీ రెడ్డి అభిరామ్ తో తనకు అఫైర్ ఉందంటూ ఫోటోలు బయట పెట్టడంతో అప్పట్లో బాగా వైరల్ అయ్యాడు. మొదట్లో సినిమా ప్రొడక్షన్ పనులను చూసుకుంటూ సినిమా ఇండస్ట్రీలోనే ఉన్న అభిరామ్ నటన వైపు ఆసక్తితో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
మరదలిని పెళ్లి చేసుకోబోతున్న అభిరామ్…
దగ్గుబాటి సురేష్ బాబు తనయుడైన అభిరామ్ అహింస సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చినా సినిమా పెద్దగా ఆడలేదు. అయితే అభిరామ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ సినిమా తరువాత అభిరామ్ పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు షికారు చేసినా దగ్గుబాటి ఫ్యామిలీ స్పందించలేదు. అయితే తాజాగా అభిరామ్ పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
సురేష్ బాబు మేనకోడలైన ప్రత్యూషనే వివాహం చేసుకుంటున్నాడు అభిరామ్. సురేష్ ప్రొడక్షన్స్ లో పనులను చూసుకుంటున్న ప్రత్యుషతో అభిరామ్ వివాహం డిసెంబర్ 6న శ్రీలంక లోని ఒక రిసార్ట్ లో సన్నిహితుల మధ్య జరగనుంది. ఇక వివాహం అనంతరం హైదరాబాద్ లో సినీ, రాజకీయ ప్రముఖులకు రిసెప్షన్ ఇవ్వనున్నారు.
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…