Dhee dancer Manikanta : ఈటీవీ లో ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షో ఇప్పటికి మొదలై దాదాపు 13 ఏళ్ళు కావొస్తున్నా ఆ షోకి ఉన్న క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. తెలుగు బుల్లి తెర మీద ఆ షోకి ఉన్న క్రేజ్ మరో డాన్స్ షోకి లేదు. ఎంతో మంది సినిమాల్లో ఉన్న ఇప్పటి కోరియోగ్రాఫర్లను అందించింది ఢీ షోనే. అలాంటి ఢీ షోలో ప్రస్తుతం పనిచేస్తున్న క్రేజి డాన్సర్ మణికంఠ. ఒకవైపు ఢీ లో చేస్తూనే మరోవైపు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లో కూడా చేస్తున్నాడు. ఇక తాజాగా యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన లైఫ్ స్ట్రగల్స్ అలాగే లవ్ స్టోరీస్ గురించి వివరించాడు.
అందరూ చనిపోయారు… తనని లవ్ చేశా…
మణికంఠ కర్ణాటక రాష్ట్రానికి చెందిన కుర్రాడు, చిన్నతనం నుండి డాన్స్ అంటే ఎంతో ఇష్టం. అలాగే ఒక డాన్సర్ గా ఢీ షోలో పాల్గొనాలని కూడా అనుకునేవాడు. అలా ఢీ లోకి వచ్చిన మణికంఠ అలా ఎన్నో ఆడిషన్స్ లో అవమానలను ఎదుర్కొన్నాను అంటూ చెప్పారు. ఇక తన కుటుంబం గురించి చెబుతూ అమ్మ, నాన్న, అన్న, వదిన ఉండగా అన్న ఆక్సిడెంట్ లో చనిపోయాడు ఆ పైన ప్రెగ్నెంట్ గా ఉన్న వదిన చనిపోయింది. ఇక నాన్న అనారోగ్యంతో మరణించగా తల్లి కూడా ఆ తరువాత అనారోగ్య సమస్యలతో మరణించింది. ఇలా వరుసగా అందరూ మరణించడంతో తల్లి మరణించాక తాను సుసైడ్ చేసుకోవాలని భావిస్తే ఢీ ఆడిషన్స్ కి సెలెక్ట్ అయిన నన్ను జిత్తు మాస్టర్ తండ్రిలా అక్కున చేర్చుకున్నారు.
నాలో ధైర్యాన్ని నింపి మళ్ళీ నిలబెట్టారు అంటూ చెప్పాడు. ఇక తన లైఫ్ లో ఎవరూ లేరని అయితే జిత్తు మాస్టర్ కుటుంబం నన్ను బాగా చూసుకుంటున్నారని చెప్పిన మణికంఠ తన లవ్ స్టోరీస్ గురించి మాట్లాడుతూ ఐదో తరగతిలో ఉన్నపుడు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను కానీ చెప్పలేదు. ఇప్పుడు ఎవరు లేరు కాకపోతే ఢీ లో నేను తేజస్విని కలిసి ఒక డ్యూయెట్ కి చేయడం వల్ల సోషల్ మీడియాలో మా మధ్య ఏదో ఉంది అనుకున్నారు. కానీ అదంతా ఉత్తిదే, తాను మంచి ఫ్రెండ్స్ అంటూ చెప్పాడు. ఇక తన లక్ష్యం ఎప్పటికైనా లారెన్స్ మాస్టర్ వద్ద డాన్స్ చేయాలని అంటూ చెప్పాడు మణికంఠ.
మహాశివరాత్రి వేళ భక్తుల రద్దీతో కళకళలాడిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం మరోసారి విశ్వాసానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది.…
పండ్లలో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చేది బొప్పాయి. సంవత్సరం పొడవునా అందుబాటులో ఉండే ఈ…
చాలామంది ఇళ్లలో ఒకే సీన్ కనిపిస్తుంది. రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయాన్నే చెత్తబుట్టలో పడేయడం. “పాత అన్నం తింటే కడుపు…
దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ Regina Cassandra తాజాగా బాలీవుడ్ అనుభవాలపై సంచలన వ్యాఖ్యలు…
2026 టీ20 వరల్డ్ కప్ ఉత్కంఠభరిత దశలోకి అడుగుపెట్టింది. లీగ్ పోరాటాలు దాదాపు ముగియడంతో ఇప్పుడు అందరి చూపు సూపర్-8…
అంతరిక్ష రంగంలో కెరీర్ కలలు కనే విద్యార్థులకు ఇది మంచి అవకాశం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన విక్రమ్…