Corona: ‘‘నీకు కరోనా వచ్చిందా.. అయితే చచ్చిపో..’’ నెటిజన్ల షాకింగ్ కామెంట్స్..ఏమైందంటే..?
Corona: ప్రస్తుతం కరోనా వ్యాప్తి మళ్లీ పెరిగింది. ఇప్పటికే మనం కోవిడ్ సెకండ్ వేవ్ ను చూశాం. మన ఇంట్లోనో లేకపోతే.. సన్నిహితులకో ఎవరికో ఒకరు కరోనాతో బాధపడే ఉంటారు. మనకు తెలిసిన వారు కరోనాతో మరణించే ఉంటారు.
అయితే ఇలాంటి కరోనా మహమ్మారి వస్తే… అందరూ కోరుకునేది సదరు బాధితుడు త్వరగా కోలుకోవాలని. ఈ మహమ్మారి శత్రువుకు సోకినా కూడా.. కోలుకోవాలని కోరుకుంటూ ఉంటారు. అయితే ఈ హీరోయిన్ విషయంలో మాత్రం ఇందుకు రివర్స్ జరుగుతోంది. బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ నటిగా కన్నా వివాదాలతోనే ఎక్కువగా ఫేమస్ అవుతూ ఉంటుంది. ఇది వేరే విషయం అనుకోండి.
అయితే ఇటీవల ఈ అమ్మడు కరోనా బారిన పడింది. ‘తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు, క్వారంటైన్ లో ఉంటున్నట్లు, కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారంతా టెస్టులు చేయించుకోవాలి, డబుల్ మాస్క్ ధరించి సురక్షితంగా ఉండాలని, ఇప్పటికే డబుల్ డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నందున త్వరలోనే నెగిటివ్ వస్తుందని ఆశిస్తున్నా’ అని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించింది.
నిజానికి సినిమా స్టార్లకు క్రేజ్, అభిమానం ఉంటుంది. సాధారణంగా అయితే నెటిజెన్లు ‘‘గెట్ వెల్ సూన్’’, ‘‘త్వరగా కోలుకోవాలని’’ కోరుతుంటారు. కానీ ఇక్కడ మాత్రం అందుకు రివర్స్ జరుగుతోంది. కరోనా విషయంలో మాత్రం నటి స్వరాభాస్కర్ విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. గుడ్‌న్యూస్ చెప్పావు. ‘2022లో బెస్ట్ న్యూస్ ఇదే, కరోనా వచ్చిందా? అయిదే చచ్చిపో.. నీ మరణవార్త కోసం ఎదురు చూస్తుంటాం’ అంటూ ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే గతంలో స్వరా భాస్కర్ బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ఉంటుంది. తరుచు హిందువులపై, హిందూ మతంపై ఏదో ఓ పిచ్చి కామెంట్ చేస్తుంటుంది. ప్రధానితో పాటు పలువురిని కూడా విమర్శించింది. దీంతో నెటిజన్లకు ఈమె కామెంట్లు రుచించేవి కాదు. ఈ కారణం చేతే ఆమెను నెటిజెన్లు ట్రోలింగ్ చేస్తున్నారా.. అనే అనుమానం కలుగుతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…