Deepika Padukone: ఆ విషయంలో నా మెదడు పని చేయలేదు.. దీపికా పదుకొనే ఆసక్తికర వ్యాఖ్యలు..!
Deepika Padukone: కోవిడ్ -19 సెకండ్ వేవ్ సమయంలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనే వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 2021లో నటి , ఆమె కుటుంబంతో సహా ఆమె తండ్రి ప్రకాష్, సోదరి అనిషా, తల్లి ఉజ్జలకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది.
తర్వాత వారంతా కోలుకున్న విషయం విధితమే. దీపికా పదుకొణె ఇటీవలి ఇంటర్వ్యూలో.. ఆమె కోవిడ్-19తో ఎలా పోరాడిందో చెప్పుకొచ్చింది. వైరస్ బారిన పడిన తర్వాత తాను రెండు నెలలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యానని.. ఆ సమయంలో కోవిడ్ వచ్చి తర్వాత వారంలోనే కోవిడ్ తగ్గినా.. రెండు నెలల వరకు ఆ పెయిన్ పోలేదని చెప్పుకొచ్చింది.
కోవిడ్ తర్వాత జీవితం అంతా మారిపోయిందని.. ఎందుకంటే శారీరకంగా.. నన్ను నేనే గుర్తించలేనంతగా మారిపోయాను అని చెప్పుకొచ్చింది. నాకు ఇచ్చిన మందులు, నేను వేసుకున్న స్టెరాయిడ్స్ కారణంగా అలా అయింది అనుకుంటా అని చెప్పింది.
కాబట్టి కోవిడ్ విచిత్రంగా, మీ శరీరానికి, మనస్సుకి భిన్నంగా ఎన్నో మార్పులను కారణం అవుతుందంని చెప్పుకొచ్చింది. ఇక తాను అనారోగ్యంగా ఉన్పప్పుడు నా మనస్సు బాగానే అనిపించినా.. రాను రాను మెదడు పని చేయలేదని అందుకే రెండు నెలల వరకు ఎటూ వెళ్లకుండా ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నానని చెప్పింది. నేను ఆ దశలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యాను అని చెప్పింది. ఇక ఆమె తదుపరి చిత్రం ‘గెహ్రైయాన్’ గురించి మాట్లాడుతూ.. దర్శకుడు శకున్ బాత్రా ఈ సినిమా అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని అన్నారు. ఆధునిక వయోజన సంబంధాలకు అద్దం పట్టే విధంగా.. భావోద్వేగాల నడుమ ఈ సినిమా ఉంటుందని చెప్పుకొచ్చింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…