Rajamouli: రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ ఖర్చుతో ఒక చిన్న సినిమా తీయొచ్చు తెలుసా?
Rajamouli: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ,యంగ్ టైగర్ ఎన్టీఆర్ , దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ” ఆర్ఆర్ఆర్ “. టాలీవుడ్ ఇద్దరు స్టార్ హీరోలతో రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల కోసం భారీగా ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం దర్శకుడు రాజమౌళి భారీగా ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఎటువంటి సినిమా అయినా కథ కథనం సంగీతం అన్ని ఎంత బాగా ఉన్న ప్రచారం చేయటం చాలా ముఖ్యం. ప్రచారం చేయటం వల్ల సినిమాని ప్రేక్షకులకు దగ్గర అ చేయవచ్చన్న ఆలోచనతో మన జక్కన్న ఈ సినిమా ప్రచారాన్ని వరుసగా తెలుగు ,తమిళం , కన్నడ ,మలయాళం , హిందీ భాషలలో భారీ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రమోషన్ ప్రారంభించముందే ముంబైలో పీవీఆర్ కలిసి ఒక ఈవెంట్ ప్లాన్ చేసుకున్నారు చిత్ర యూనిట్. ట్రైలర్ లాంచ్ చేసినప్పటి నుండి ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భారీతనం చూపించటానికి దాదాపు ఇరవై నుండి 25 కోట్ల వరకు ఖర్చు చేశారని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ సినిమా ట్రైలర్ ముంబైలో లాంచ్ చేసినప్పుడు ఆ ఈవెంట్ కోసం దాదాపు మూడు వేల మంది అభిమానుల్ని తెలుగు రాష్ట్రాల నుండి అక్కడికి తీసుకెళ్లారు. ఇలా చేయటం వల్ల ఆర్ఆర్ఆర్ హీరోలకు అక్కడ ఈ స్థాయి ఆదరణ లేదనే విషయం అందరికీ తెలిసిపోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం రాజమౌళి , ఎన్టీఆర్ , రామ్ చరణ్ , దానయ్య మాత్రమే కాకుండా వారి సహాయకులు కూడా వారి వెంట తిరుగుతూ ఉన్నారు.. వారందరి కోసం ప్రత్యేక విమానాలు బస్సులు బస చేయడం కోసం హోటల్ రూమ్స్ ఇలా అన్ని లెక్కలోకి వేసుకుంటే ఈ సినిమా మా ప్రమోషన్స్ కోసం పెట్టే ఖర్చుతో ఒక సినిమా తీయవచ్చు అని టాలీవుడ్ వర్గాలలో వినికిడి. ఈ మాత్రం బడ్జెట్ ప్రమోషన్స్ కోసం ఖర్చు చేయకపోతే సినిమా ప్రచారం ఈ రేంజ్ లో ఉండేది కాదు.
భారత్–పాకిస్థాన్ మధ్య నీటి అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. పాకిస్థాన్‌కు ప్రవహిస్తున్న రావి నది మిగులు జలాలను ఇకపై పూర్తిగా…
భారతీయ వ్యాపార రంగంలో ప్రముఖ కుటుంబానికి చెందిన అనంత్ అంబానీ మరోసారి తన దాతృత్వంతో వార్తల్లో నిలిచారు. గుజరాత్ రాష్ట్రంలోని…
టాలీవుడ్‌లో గత కొంతకాలంగా హాట్ టాపిక్‌గా మారిన కాంబినేషన్ ఇదే. రెబల్ స్టార్ Prabhas, ‘హనుమాన్’తో సంచలనం సృష్టించిన దర్శకుడు…
దేశంలో సైబర్ నేరాలు రోజురోజుకు కొత్త రూపాల్లో బయటపడుతున్నాయి. తాజాగా FASTag సేవల పేరుతో భారీ ఆన్‌లైన్ మోసం వెలుగులోకి…
తెలంగాణలో ఉన్నత విద్యను ఆశించే విద్యార్థులకు కీలక సమాచారం. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో…
ఇప్పటి జీవనశైలిలో క్రెడిట్ కార్డు ఒక సాధారణ ఆర్థిక సాధనంగా మారిపోయింది. షాపింగ్, ఆన్‌లైన్ లావాదేవీలు, అత్యవసర ఖర్చులు… ఇలా…