పంజాబ్‌లోని చండీగఢ్‌కు చెందిన మోడల్ హర్నాజ్ సంధు దాదాపు 21 సంవత్సరాల తర్వాత ‘మిస్ యూనివర్స్ 2021’ టైటిల్‌ను గెలుచుకుని అందరినీ గర్వపడేలా చేసింది. 2000లో నటి లారా దత్తా టైటిల్‌ను గెలుచుకున్న తర్వాత సంధు కిరీటాన్ని ధరించిన మూడవ భారతీయురాలిగా రికార్డులకు ఎక్కింది.
సోమవారం ఇజ్రాయెలీ రెడ్ సీ రిసార్ట్ టౌన్ ఐలాట్‌లో మెక్సికోకు చెందిన మునుపటి మిస్ యూనివర్స్ ఆండ్రియా మెజాచే హర్నాజ్ 70వ మిస్ యూనివర్స్ కిరీటాన్ని పొందారు. 21 ఏళ్ల ఆమె శ్రేయోభిలాషులు , బాలీవుడ్ ప్రముఖుల నుండి అభినందనలు అందుకున్నారు. ఇక ఈమె మిస్ యూనివర్స్ పోటీలకు వెళ్లకముందే పంజాబీ సినీ పరిశ్రమలో(పాలీవుడ్) అడుగు పెట్టింది.
ప్రముఖ నటి ఉపాసనా సింగ్ కుమారుడు నానక్ సరసన పంజాబీ చిత్రం ‘బాయి జీ కుట్టాంగే’తో తొలిసారిగా నటిస్తోందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఉపాసన సింగ్ ప్రొడక్షన్ హౌస్ ‘సంతోష్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టూడియో’ నిర్మిస్తుంది. దీనిలో నటులు యాక్షన్ హీరో దేవ్ ఖరౌద్, గురుప్రీత్ ఘుగ్గీ, ఉపాసన, హాబీ ధలీవాల్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమా ఇది 27 మే 2022న విడుదల కానుంది.
అంతే కాకుండా హర్నాజ్ రెండో చిత్రం జూలై 2022లో విడుదల కానుంది. మిస్ యూనివర్స్ 2021 అయినందుకు ఈమెను కంగనా రనౌత్ అభినందించి.. ఇది సంతోషకరమైన వార్త అంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఇక హర్నాజ్ త్వరలోనే బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తుందని సమాచారం. గతంలో ప్రపంచ సుందరిగా కిరీటాన్ని దక్కించుకున్న వారిలో సినిమాల్లోకి రావడానికి కాస్త టైం పట్టింది. హర్నాజ్ మాత్రం ముందుగానే ఎంట్రీ ఇవ్వడం గమనార్హం.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ విడుదలకు సిద్ధమైంది. గత…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బ్యూటీ రంగంలో అత్యంత ఎక్కువగా వినిపిస్తున్న పదాల్లో "కొరియన్ స్కిన్‌కేర్" ఒకటి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికలపై…
తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించడం…
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా తగ్గుదల దిశగా…
కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…