Featured

శివశంకర్ మాస్టర్ చివరి కోరిక ఎంటో తెలుసా.. సినిమాల్లో విజయవంతం అవ్వడానికి కారణం కూడా అదే..!

ప్రముఖ నృత్య దర్శకుడు శివ శంకర్ మాస్టర్ (72) కరోనాతో పోరాడి ఓడి .. మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. దీంతో చలన చిత్ర పరిశ్రమలోని నటీనటులు, నిర్మాతలు, రాజకీయ నేతలు సహా పలువురు శివ శంకర్ మాస్టర్ మృతికి సంతాపం తెలుపుతున్నారు.

తన సినీ కెరీర్ లో 800 కు పైగా చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా పని చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు శివశంకర్ మాస్టర్.. జాతీయ చలనచిత్ర అవార్డు పొందిన శివశంకర్ చిత్ర పరిశ్రమకు చేసిన సేవలు ఎన్నడూ గుర్తుంటాయని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని.. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని చిరంజీవి, సోనుసూద్‌, మంచు విష్ణుతో పాటు పలువురు హీరోలు నివాళులు అర్పిస్తున్నారు.

అయితే ఆయన తుది శ్వాస వరకు సినిమాల్లో పనిచేయాలని.. తన మరణం కూడా సినిమా సెట్ లోనే ఉండాలనేది ఆయన చివరి కోరిక అంటూ అతడు ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అతడి సన్నిహితులు, స్నేహితులకు కూడా ఇలా ఎన్నో సార్లు చెప్పాడట. దీనిని బట్టి అర్థం అవుతుంది అతడికి తన వృత్తి పట్ల ఉండే అంకితభావం ఎలాంటిదో.

ఇక అతడు సినీ కొరియోగ్రాఫర్ గానే కాకుండ 30కి పైగా చిత్రల్లో నటించాడు. మగధీర సనిమాకు ధీర ధీర సాంగ్ కు జాతీయ అవార్డును అందుకున్నాడు. ఇక అతడు చివరి సారిగా కొరియోగ్రఫీ చేసిన చిత్రం బాహుబలి 1. తర్వాత చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ.. టీవీ షోలల్లో జడ్జిగా వ్యవహరిస్తూ వస్తున్నాడు. అయితే శివశంకర్ మాస్టర్ చనిపోయేముందు కొవిడ్ నెగిటివ్ గా నిర్ధారణ అయ్యిందని ఏఐజీ వైద్యులు తెలపడం విశేషం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

తిరుమల శ్రీవారి సేవకు.. కృష్ణయ్య, పురాణపండలకు ఎన్ని జన్మల పుణ్యమిది..

హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…

4 hours ago

మార్చి 3 చంద్రగ్రహణ ప్రభావం.. జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులే!

2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…

7 hours ago

మేడి పండులో నిజంగానే పురుగులుంటాయా? అసలు నిజం ఇదే!

“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…

7 hours ago

వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ? క్లారిటీ ఇచ్చిన కవిత:

తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…

8 hours ago

తెలంగాణ విమానయాన రంగంలో మరో అడుగు.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర గ్రీన్ సిగ్నల్:

తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…

10 hours ago

నెలసరి నొప్పులతో బాధపడుతున్నారా? ఈ నేచురల్ జ్యూస్ ట్రై చేయండి!

నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…

10 hours ago