ప్రముఖ నృత్య దర్శకుడు శివ శంకర్ మాస్టర్ (72) కరోనాతో పోరాడి ఓడి .. మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. దీంతో చలన చిత్ర పరిశ్రమలోని నటీనటులు, నిర్మాతలు, రాజకీయ నేతలు సహా పలువురు శివ శంకర్ మాస్టర్ మృతికి సంతాపం తెలుపుతున్నారు.
తన సినీ కెరీర్ లో 800 కు పైగా చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా పని చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు శివశంకర్ మాస్టర్.. జాతీయ చలనచిత్ర అవార్డు పొందిన శివశంకర్ చిత్ర పరిశ్రమకు చేసిన సేవలు ఎన్నడూ గుర్తుంటాయని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని.. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని చిరంజీవి, సోనుసూద్, మంచు విష్ణుతో పాటు పలువురు హీరోలు నివాళులు అర్పిస్తున్నారు.
అయితే ఆయన తుది శ్వాస వరకు సినిమాల్లో పనిచేయాలని.. తన మరణం కూడా సినిమా సెట్ లోనే ఉండాలనేది ఆయన చివరి కోరిక అంటూ అతడు ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అతడి సన్నిహితులు, స్నేహితులకు కూడా ఇలా ఎన్నో సార్లు చెప్పాడట. దీనిని బట్టి అర్థం అవుతుంది అతడికి తన వృత్తి పట్ల ఉండే అంకితభావం ఎలాంటిదో.
ఇక అతడు సినీ కొరియోగ్రాఫర్ గానే కాకుండ 30కి పైగా చిత్రల్లో నటించాడు. మగధీర సనిమాకు ధీర ధీర సాంగ్ కు జాతీయ అవార్డును అందుకున్నాడు. ఇక అతడు చివరి సారిగా కొరియోగ్రఫీ చేసిన చిత్రం బాహుబలి 1. తర్వాత చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ.. టీవీ షోలల్లో జడ్జిగా వ్యవహరిస్తూ వస్తున్నాడు. అయితే శివశంకర్ మాస్టర్ చనిపోయేముందు కొవిడ్ నెగిటివ్ గా నిర్ధారణ అయ్యిందని ఏఐజీ వైద్యులు తెలపడం విశేషం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…