Categories: FeaturedMovie News

చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల మధ్య ఇన్ని తేడాలు విభేదాలు ఉన్నాయని మీకు తెలుసా ?

పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీలో అరంగేట్రం చేసి కేవలం తన నటనా ప్రతిభ తోనే పవర్ స్టార్ అనే బిరుదును సంపాదించారు. తొలిప్రేమ, ఖుషి వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించి అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.

2018వ సంవత్సరంలో అజ్ఞాతవాసి సినిమాలో కనిపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్, విరుపాక్ష లతో పాటు మరొక సినిమాలో హీరోగా నటిస్తున్నారు. దాదాపు మూడు దశాబ్దాల లో ఎదురులేని ఎన్నో హిట్ చిత్రాల్లో హీరోగా నటించే ఎదురులేని స్టార్ గా కొనసాగిన పవన్ కళ్యాణ్ ఎప్పటికీ లక్షల మంది వీరాభిమానుల ను కలిగి ఉన్నారంటే అతిశయోక్తి కాదు. కెరీర్ తొలినాళ్ళలో పవన్ కళ్యాణ్ చాలా సిగ్గు, బిడియం తో ఉండేవారు. సినిమా చిత్రీకరణ సమయంలో కూడా ఎవరితో మాట్లాడకుండా ఒక పుస్తకం పట్టుకొని చదువుతూ ఉండేవారు. పవన్ కళ్యాణ్ ని చూసిన చాలామంది ఇతను ఏంటి ఇంత నిస్సిగ్గుగా, ఎవరితో కలుపుగోలుగా ఉండడం లేదు. సినిమా హీరో అంటే అందరితో మాట్లాడాలి. కానీ అతనిలో హీరో అయ్యే లక్షణాలు అస్సలు కనిపించడం లేదు అని అనుకునేవారు.

చిరంజీవి విషయానికొస్తే అతను మొదటి నుంచే చాలా కలుపుగోలుగా ఉండేవారు. సినిమా సెట్స్ లో అందరితో మాట్లాడుతూ చాలా సరదాగా ఉండేవారు. అందరినీ ఆప్యాయంగా పలకరించేవారు. పవన్ కళ్యాణ్ కూడా ఎవరైనా పలకరిస్తే చాలా గౌరవం ఇచ్చి మాట్లాడేవారు. నిజానికి చాలా మంది పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని చులకనగా మాట్లాడుతుంటారు. నిజం చెప్పాలంటే పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్న తర్వాత వేరొకరిని పెళ్లి చేసుకోవచ్చు. అదే ఏ విధంగా తప్పు కాదు. కానీ అతడిని అనవసరంగా దూషిస్తున్నారు చాలామంది అని పవన్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేసుకుంటారు.

ఇకపోతే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆ తర్వాత రాజకీయ సన్యాసం తీసుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం పార్టీ స్థాపించి ఘోరాతి ఘోరంగా అపజయాన్ని చవిచూశారు. కానీ రాజకీయ సన్యాసం తీసుకోలేదు. అన్నయ్య చిరంజీవి అంటే తమ్ముడు పవన్ కళ్యాణ్ కి మిక్కిలి ప్రేమ. ఈ విషయం చాలా సందర్భాల్లో రుజువైంది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago