Dil Raju : నిఖిల్ సిధార్థ్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా వచ్చిన సినిమా ‘కార్తికేయ 2’. కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించారు. కాశ్మీర్ ఫైల్స్ వంటి సినిమాలు తీసిన అభిషేక్ అరెస్ నుండి ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమా ఆగష్టు 13 న విడుదలయి మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో అమీర్ ఖాన్ లాల్ చద్ధ సింగ్, అక్షయ కుమార్ రక్షా బంధన్ సినిమాలను కూడా వెనక్కి నెట్టి మంచి వసూళ్లను రాబడుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి కలెక్షన్స్ తో ముందుకు వెళ్తున్న ఈ సినిమా, ప్రస్తుతం సక్సెస్ మీట్ నిర్వహించారు.
మీకు తెలిస్తే రాయండి.. లేకపోతే మూసుకోండి…
ఇక సినిమా విడుదల సమయంలో దిల్ రాజు మీద బాగా ట్రోల్ల్స్ వచ్చాయి. సినిమాను విడుదల చేయనియ్యకుండా దిల్ రాజు అడ్డుకున్నాడు అంటూ కథనాలు వచ్చాయి. ఇక సక్సెస్ మీట్ కి గెస్ట్ గా వచ్చిన దిల్ రాజు ఈ విషయాల గురించి క్లారిటీ ఇచ్చారు. ఎవరికి తోచింది వాళ్ళు వ్యూస్ కోసం, సబ్ స్క్రైబర్స్ కోసం రాసేస్తున్నారు. తెలిస్తే రాయాలి లేకపోతే తెలుసుకోవాలి అంతే కానీ ఏది బడితే అది రాస్తే ఎలా. నేను మామూలుగా ఏ విషయాన్ని పట్టించుకోను కానీ ఈ సారి మాట్లాడకపోతే నా గురించి తప్పుగా అనుకుంటారు, అది నిజం అనుకుంటారు అనే మాట్లాడుతున్నాను.
నిజానికి కార్తికేయ 2 సినిమా విడుదల థాంక్యూ సినిమా విడుదల తేదీతో క్లాష్ అవ్వకుండా మీ సినిమాను ముందుకు వాయిదా వేసుకోమని చెప్పాను. ఆ తరువాత ఆగష్టు 12 న అనుకున్నారు కానీ ఆ డేట్ లో వేరే సినిమాలు ఉండటం వల్ల ప్రొడ్యూసర్ కి డైరెక్టర్, హీరో కి అదే చెప్పాను. మీ ఇష్టం కానీ మిగతా సినిమాలు ఉన్నాయి చూసుకొండని సలహా ఇచ్చాను అంతే కానీ ఆపేయండి అని చెప్పలేదు. అసలు ఒక సినిమాను తొక్కేయడానికి నేనెవరిని, అభిషేక్ వారి సినిమాలు ప్రస్తుతం ఎనిమిది లైన్లో ఉన్నాయి పెద్ద ప్రొడక్షన్ హౌస్ అది దాన్ని నేను తొక్కేయడం ఏంటి, తెలియకుండా ఏవేవో రాసి మా మధ్య గొడవలు పెట్టకండి. నిఖిల్ నాకు హ్యాపీ డేస్ టైం నుండి తెలుసు అంటూ దిల్ రాజు సోషల్ మీడియా మీద ఫైర్ అయ్యాడు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…