Dil Raju: తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దిల్ రాజు ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్నారు.ఇలా దిల్ రాజు ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఈయన ఎప్పుడు మీడియా ముందుకు వచ్చిన కేవలం సినిమాల గురించి మాత్రమే మాట్లాడేవారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ సినిమాల గురించి కాకుండా తన వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. దిల్ రాజు గత రెండు సంవత్సరాల క్రితం తేజస్విని అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా జన్మించారు. అయితే ఈయన తేజస్విని ప్రేమించి పెళ్లి చేసుకున్నారంటూ తాజాగా తమ లవ్ స్టోరీని బయటపెట్టారు.
దిల్ రాజు మొదటి భార్య అనిత గుండెపోటుతో మరణించిన తర్వాత మూడు సంవత్సరాల పాటు ఈయన ఒంటరిగా ఎన్నో కష్టాలను అనుభవించానని, ఆ సమయంలోనే తనకు తోడు అవసరమనిపించే రెండో పెళ్లికి సిద్ధమయ్యానని తెలిపారు. అయితే నా బిజీ షెడ్యూల్ కారణంగా తనని అర్థం చేసుకునే వారు అయితే బాగుంటుందని ఆలోచించాననీ తెలిపారు.
ఇక తేజస్విని ఎయిర్ హోస్టర్స్ గా పని చేస్తున్న సమయంలో ఆయన ప్రయాణిస్తున్న ప్రతిసారి తేజస్విని గమనిస్తూ ఉండేవారట. ఇలా ఏడాది పాటు తనని గమనించిన తర్వాత తన ఫోన్ నెంబర్ తీసుకొని అనంతరం తనకు ప్రపోజ్ చేశానని నా ప్రపోజల్ ఒప్పుకున్న తర్వాతే ఈ విషయం ఇంట్లో వారికి చెప్పి ఇద్దరం పెళ్లి చేసుకున్నామని ఈ సందర్భంగా దిల్ రాజు తన లవ్ స్టోరీ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…