MegaStar Chiranjeevi: లూసిఫర్ సినిమా రిమేక్ ‘గాడ్ ఫాదర్ ’ పై .. దర్శకుడు ఆసక్తికర వ్యాఖ్యలు..!
Mega Star Chiranjeevi: తెలుగులో త్వరలో చిరంజీవి హీరోగా తెరెకెక్కుతున్న సినిమా ‘‘గాడ్ ఫాదర్’’. దీనిని మళయాల సూపర్ హిట్ సినిమా లూసిఫర్ కు రిమేక్ గా తెరకెక్కిస్తున్నారు. మళయాలంలో ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకుడిగా పనిచేశాడు. హిట్లర్ సినిమాకు కూడా ఎడిటర్ మోహన్ నిర్మించిన ఈ సినిమాకు మోహన్ రాజా పనిచేశాడు.
రామ్ చరణ్ నటించిన ధృవ ఓరిజినల్ తనీ ఒరువన్ ను కూడా మోహన్ రాజా తెరకెక్కించడం విశేషం. హనుమాన్ జంక్షన్ సినిమాను కూడా తెరకెక్కించింది కూడా ఈయనే. దాదాపు ఈ సినిమాను తెలుగులో నిర్మించి 20 ఏళ్లు పూర్తయ్యాయి. దాదాపు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత గాడ్ ఫాదర్ తో మళ్లీ తెలుగు ప్రేక్షకులకు దగ్గర అవుతున్నారు. తాజాగా ఈ చిత్రం గురించి అతడు కొన్ని విషయాలను మాట్లాడారు.
హిట్లర్ సినిమా సమయంలో తనకు 22 ఏళ్లు.. గ్యాంగ్ లీడర్ టైంకు తాను చిరంజీవికి పెద్ద ఫ్యాన్ అంటూ చెప్పుకొచ్చాడు. హిట్లర్ సినిమా ఒరిజినల్ వెర్షన్ మళయాలంలో చిరంజీవి చూసే సమయంలో అతని పక్కనే ఉన్నానని.. చిరంజీవికి అర్థం కాని సీన్లు వచ్చే సమయంలో తానే తెలుగులో చెప్పానని.. అన్నాడు.
మళ్లీ ఇన్నాళ్లకు తనకి చిరంజీవితో కలిసి పని చేసే అవకాశం వచ్చిందన్నారు. ఇక లూసిఫర్ సినిమాను మక్కీకి మక్కీ కాకుండా.. మెగస్టార్ కు తగినట్లుగా కొన్ని మార్పులు చేశామన్నారు. అతడు షూటింగ్ చేస్తున్న సమయంలో.. నేను కట్ చెప్పకుండానే.. మర్చిపోయి అలా చూస్తూ ఉండిపోయానన్నారు. అంతలా సినిమాలో లీనమయ్యానన్నాడు. జవవరిలో షూటింగ్ అంతా చాలా వరకు పూర్తి అవుతుందన్నారు. మళయాలంలో చూసిన వారికి కూడా.. ఇది బాగా నచ్చుతుందన్నారు. మెగస్టార్ అభిమానులకు తగ్గట్లుగా సినిమా ఉంటుందని మోహన్ రాజా ఈ సందర్భంగా వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…