Director Geetha Krishna : కన్నడ నుండి ఏ మాత్రం అంచనాలు లేకుండా డబ్బింగ్ సినిమాగా విడుదల అయిన ‘కాంతార’ సినిమా తెలుగులో మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇప్పటికీ ఈ సినిమా వసూళ్లను రాబడుతూ ప్రేక్షకాధరణతో వెళ్తోంది. చిన్న బడ్జెట్ సినిమాగా వచ్చిన ఈ కన్నడ సినిమా అక్కడి నేటివిటికి సంబంధిచిన కథతో తెరకెక్కింది. హీరో, డైరెక్టర్ ఒకడే కావడం కథలో చూసే ప్రేక్షకులను లీనం చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. కేజీఎఫ్ సినిమా తీసిన నిర్మాణ సంస్థ హుంబలే నే ఈ సినిమాను కూడా నిర్మించింది. కేవలం 16 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 100 కోట్లు కొల్లగొట్టిందని వినిపిస్తోంది. ఇక ఈ సినిమా సక్సెస్ గురించి సీనియర్ డైరెక్టర్ గీతా కృష్ణ ఆయన అభిప్రాయాలను పంచుకున్నారు.
సుత్తి సినిమా అందులో ఏమీ లేదు…
గీతా కృష్ణ మాట్లాడుతూ కాంతార సినిమాలో మొదట కాసేపు చివర్లో ఒక ఎనిమిది నిమిషాలు తప్ప సినిమాలో ఇంకేం లేదు, మధ్యలో అంత కథ ఏమీ లేదు. హీరో గాలికి తిరుగుతుంటాడు వాళ్ళ అమ్మ తిడుతుంటుంది అంతే. ఇక ఈ సినిమాను హాలీవుడ్ సెకండ్ గ్రేడ్ సినిమా నుండి కాపీ చేసారు. ఆ సినిమాకి మార్పులు చేసి కన్నడ నేటివిటీని జోడించి చూపించారు. పక్కాగా కాపీ చేసాడు డైరెక్టర్ అడవిలో సినిమా తీయడం వల్ల పెద్దగా ఖర్చు కూడా అవ్వలేదు కానీ 16 కోట్లు బడ్జెట్ అంటూ చెబుతున్నారు.
కన్నడ సినిమాకు ఎనిమిది కోట్లు మించి బడ్జెట్ లేదు వాళ్ళు మహా అంటే ఎనిమిది తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టుంటారు, ఊరికే పదహారు కోట్లు అంటూ చెబుతున్నారు. జనాలకు ఈ మధ్య సినిమా ఏంటి అనే అవసరం లేదు ఆహా ఓహో అనేలా అడవుల్లోను గ్రాఫిక్స్ ఉంటే చాలు చూసేస్తున్నారు. కాంతార సినిమాలో కథ ఏం లేకపోయినా నేటివిటీ, భూత కాలం కాన్సెప్ట్ తో హిట్ కొట్టారు, అందునా హాలీవుడ్ సినిమా కాపీ కొట్టారు. ఒక సినిమాను తక్కువ చేయాలని కాదు కానీ నిజం అదే అంటూ అభిప్రాయపడ్డారు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…