పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇండ్రస్టీ లో జరిగే ఏ సినిమా ఫంక్షన్ లో అయినా పవన్ కళ్యాణ్ ప్రస్తావన రాకుండా మానదు.. అంతటి ఫ్యాన్ బేస్ ఉన్న హీరో పవర్ స్టార్.. అయితే ఒకానొక సందర్భంలో పవన్ కళ్యాణ్ వరుస ప్లాపులతో ఇబ్బంది పడుతున్న సమయంలో.. కేవలం ఒకే ఒక్క సినిమాతో పవన్ కి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి.. ఆయన క్రేజ్ ని డబుల్ చేసాడు దర్శకుడు హరీష్ శంకర్.. ఆ సినిమాయే గబ్బర్ సింగ్.. 2012లో విడుదలైన ఈ చిత్రం.. పవన్ 11 ఏళ్ళ ఫ్లాపులకు స్వస్తి చెప్తూ.. ఒక ట్రెండ్ ని క్రియేట్ చేసింది..
ఇక హరీష్ శంకర్ ఇచ్చిన ఈ గిఫ్టును మెగాభిమానులు ఇప్పటికీ మరిచిపోలేరు. అందుకే హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా కూడా ఇప్పటికీ ఆయన్ని కేరాఫ్ గబ్బర్ సింగ్ అనే పిలుస్తుంటారు. అంతగా ఆయనకు ఈ చిత్రం గుర్తింపు తీసుకొచ్చింది. నిజానికి హరీష్ కు కూడా ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకు మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ రాలేదు. సుబ్రమణ్యం ఫర్ సేల్, డీజే, గద్దలకొండ గణేష్ లాంటి సినిమాలు పర్లేదనిపించాయే కానీ బాక్సాఫీస్ బద్ధలైపోయే విజయాలు కావు. అందుకే ఇప్పుడు మరోసారి పవన్ తో సినిమా చేయబోతున్నాడు ఈయన. రీ ఎంట్రీలో అంతా చిన్న దర్శకులతోనే సినిమాలు చేస్తున్న పవర్ స్టార్..
తొలిసారి హరీష్ శంకర్ లాంటి క్రేజీ దర్శకుడితో జోడీకట్టాడు. దాంతో అంచనాలు కూడా ఆకాశంలో ఉన్నాయి.పైగా ఈ సారి వినోదంతో పాటు సందేశం కూడా ఉంటుందని పోస్టర్ లోనే క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు. తాజాగా మార్చ్ 31న ఈయన పుట్టిన రోజు సందర్భంగా పవన్ ను ప్రత్యేకంగా కలిసాడు బర్త్ డే బాయ్ హరీష్ శంకర్. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. త్వరలోనే PSPK 28 మొదలు కానుంది. దీనికోసం తనను తాను సిద్ధం చేసుకుంటున్నాడు పవన్..!!
దేశవ్యాప్తంగా వైద్య ప్రవేశ పరీక్షగా నిర్వహించే నీట్ యూజీ చుట్టూ మరోసారి వివాదం చెలరేగింది. ఈసారి పేపర్ లీక్ ఘటన…
కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి, ప్లాటినం దిగుమతులపై కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో పెరుగుతున్న బంగారం కొనుగోళ్లను నియంత్రించడమే లక్ష్యంగా,…
దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు మళ్లీ పెరిగే అవకాశాలపై ఆర్థిక వర్గాల్లో చర్చ మొదలైంది. ముఖ్యంగా పశ్చిమ ఆసియా ప్రాంతంలో…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి క్రమంగా పెరుగుతోంది. విడుదలకు ముందు ప్రచార…
దేశంలో ఇంధన వినియోగం తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు తరువాత చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు…
తెలంగాణలోని వరంగల్ సమీపంలో ఉన్న కొమ్మాల గ్రామం ఆధ్యాత్మికతతో పాటు రైతు సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. ప్రకృతి సోయగాల మధ్య…