Director Krishna Vamsi : సున్నిత అంశాలతో భావోద్వేగాన్ని చూపిస్తూ సినిమాల్లో సహజంగా అనుబంధాలను చూపించే దర్శకుడు తెలుగులో కృష్ణ వంశీ అని చెప్పొచ్చు. ఆయన తీసిన సింధూరం, ఖడ్గం వంటి సినిమాలు మొదలు నిన్నేపెళ్లాడతా, మురారి వంటి సినిమాల వరకు అన్నీ ప్రేక్షకులను కట్టిపడేసాయి. అలాంటి కృష్ణ వంశీ చాలా కాలంగా మెగా ఫోన్ కి దూరంగా ఉంటున్నాడు. వరుస ప్లాప్స్ తో సతమతమవుతోన్న సమయంలో ఒక మంచి కంబ్యాక్ సినిమాతో మన ముందుకు వచ్చాడు. అదే రంగమార్తాండ సినిమా. ఇందులో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక మొదలుగు వారు నటించారు. ఇక ఈ సినిమా గురించిన విశేషాలను ఇంటర్వ్యూలలో పంచుకుంటున్నారు కృష్ణవంశీ.
కళ్ళు చెమర్చాయి… అన్నయ్య తో చెప్పించడానికి కారణం అదే…
రంగమార్తాండ సినిమాక రంగస్థల నటుడి జీవితం గురించి తెలిపే స్టోరీ. మరాఠి లో నానా పాటేకర్ నటించిన నట సామ్రాట్ సినిమా కథే ఇది. అయితే తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసారు. మొదట ప్రకాష్ రాజ్ సొంతంగా డైరెక్ట్ చేయాలనుకున్నా కథ కృష్ణ వంశీ దగ్గరికి వచ్చింది. ఈ సినిమాలోని భావోద్వేగం, కొన్ని సీన్స్ కూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. కథ విన్నప్పుడే నాకలా జరిగింది అందుకే కథతో బాగా ట్రావెల్ అయ్యాను అంటూ చెప్పారు.
ఇక ఈ సినిమాలో మొదట్లో వచ్చే వాయిస్ ఓవరింగ్ చిరంజీవి గారితో చెప్పించడానికి కారణం గురించి కృష్ణ వంశీ గారు తెలిపారు. నటుల గురించి చెప్పాల్సినపుడు ఒక గొప్ప నటుడే చెబితే బాగుంటుందని అనిపించింది వెంటనే చిరంజీవి గారికి చెబితే కథ విని బాగుంది అని వెంటనే వచ్చి వాయిస్ ఓవరింగ్ ఇచ్చారు. సినిమా క్లైమాక్స్ లో ప్రేక్షకులు చప్పట్లు కొడతారు కానీ చిరంజీవి గారు చెప్పే డైలాగ్ పూర్తయ్యాక జనాలు చప్పట్లు కొడుతున్నారు అంటూ తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…