Featured

Director Nandini reddy : బన్నీ నన్ను తిట్టింది అందుకే… పడాల్సిన మాటలు అన్నీ పడ్డా… తిరుపతిలో జరిగింది ఏంటంటే… పెళ్లి చేసుకోకపోవడానికి కారణం…: డైరెక్టర్ నందిని రెడ్డి

Director Nandhini Reddy : హైదరాబాద్ కు చెందిన నందిని రెడ్డి దర్శకురాలిగా మంచి సినిమాలను తీస్తూ మంచి ఇమేజ్ ను తనకంటూ సంపాదించుకున్నారు. ఒక మహిలా డైరెక్టర్ గా మంచి హిట్ సినిమాలను అందించిన నందిని తాజాగా సంతోష్ శోభన్ హీరోగా ‘అన్నీ మంచి శకునములే’ అనే సినిమాను తీసారు. ఆ సినిమా ప్రచార కార్యక్రమాలలో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న నందిని రెడ్డి తన వ్యక్తిగత జీవితం, పెళ్లి వంటి విషయాల గురించి చెప్పారు.

పెళ్లి చేసుకోకపోవడానికి కారణం…

నందిని రెడ్డి ‘అలా మొదలయింది’ సినిమాతో తన సినిమా కెరీర్ మొదలు పెట్టి మంచి హిట్ అందుకుంది. ఆపైన కళ్యాణ వైభోగం, ఓహ్ బేబీ వంటి సినిమాలతో హిట్స్ అందుకున్నా జబర్దస్త్ వంటి డిజాస్టర్ ను మూటగట్టుకుంది. ఆ సినిమా ఫ్లాప్ అయ్యాక దాదాపు మూడు నెలలు ఖాళీగా ఉన్న నందినిని బన్నీ పిలిచి ఏం చేస్తున్నావ్, నెక్స్ట్ ప్రొజెక్ట్ ఏమిటి అని అడిగి బాగా తిట్టారట. ఒక సినిమా పోయిందని అలాగే ఉండిపోతావా నెక్స్ట్ ఆలోచించవా అంటూ క్లాస్ పీకారట.

ఇక తనకు ప్రభాస్ అంటే క్రష్ అని చెప్తూ తన అంత అందగాడు మరెవరూ లేరంటూ చెప్పారు. ఇక పెళ్లి విషయానికి వస్తే సల్మాన్ ఖాన్ పెళ్లి తరువాత తాను పెళ్లి చేసుకుంటా అంటూ చెప్పారు ఇక అలా కాదనుకుంటే ప్రభాస్ పెళ్లి తరువాత తాను పెళ్లి చేసుకుంటా అంటూ చెప్పారు. ఇక తన వస్త్రధారణ గురించి మాట్లాడుతూ కంఫర్ట్ గా ఉండే బట్టలే ప్రిఫర్ చేస్తా అంటూ మాట్లాడారు. ఇక తిరుపతిలో రీసెంట్ గా జరిగిన ఇష్యూ గురించి మాట్లాడుతూ ప్రెస్ మీట్ కి ఫ్లైట్ ఆలస్యంగా ల్యాండ్ అవడం వల్ల ఆలస్యంగా వెళ్ళాం. అందుకు వాళ్ళు మీరెవరో తెలియదు పరిచయం చేసుకొండి అంటూ మాట్లాడరు. అప్పటికి నేను పరిచయం చేసుకుని సినిమా గురించి ఆర్టిస్టుల గురించి మాట్లాడి తరువాత హీరో సంతోష్ కి ఇవ్వగా తనని కూడా ఇంట్రడ్యూస్ చేసుకోవాలని చెప్పారు. అదే ఇష్యూ వేరే ఏమి లేదు అంటూ తెలిపారు నందిని రెడ్డి.

Bhargavi

Recent Posts

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

1 day ago

కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నారా? వెన్నెముకకు ముప్పు తెస్తున్న కొత్త జీవనశైలి ఇదే!

ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…

1 day ago

మధుమేహం, గుండె జబ్బులు లేకుండా పిల్లలు పుడతారా? శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది!

వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…

1 day ago

కరివేపాకుతో బరువు తగ్గొచ్చా? రోజూ ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు!

ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…

1 day ago

83 ఏళ్ల వయసులోనూ అదే కసి.. ఒక సీన్ కోసం నిద్ర మానేసిన అమితాబ్ బచ్చన్!

సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…

1 day ago

పీరియడ్స్ సమయంలో యోగా చేయొచ్చా? అపోహలు పక్కన పెట్టండి.. నిపుణులు చెబుతున్న నిజాలు ఇవే!

నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…

1 day ago