Movie News

Macherla Niyojakavargam: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి డుమ్మా.. కారణం అదేనా??

Macherla Niyojakavargam: నితిన్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో సిల్వర్ స్క్రీన్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన చిత్రం మాచర్ల నియోజకవర్గం. ఈ సినిమా ఆగస్టు 12వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా శనివారం సాయంత్రం గుంటూరులో ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

అయితే ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున చిత్ర బృందం సందడి చేశారు. అలాగే ఈ ట్రైలర్ ను దర్శకుడు అనిల్ రావిపూడి చేతుల మీదుగా విడుదల చేశారు. ఇక ఈ వేదికపై డైరెక్టర్ అనిల్ రావిపూడితో పాటు హీరో హీరోయిన్లు ఆటపాటలతో అందరిని సందడి చేశారు.ఈ విధంగా ఒక సినిమా ట్రైలర్ లాంచ్ అవుతుంటే ఆ సినిమా డైరెక్టర్ రాకపోవడం గమనార్హం.ఈ సినిమాకి దర్శకుడుగా వ్యవహరించిన ఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో కనిపించలేదు.

ఈ విధంగా ఈయన కనిపించకపోవడమే కాకుండా హీరో నితిన్ అలాగే ప్రొడ్యూసర్ సుధాకర్ సైతం ఎక్కడా కూడా తన పేరు ప్రస్తావించకపోవడం గమనార్హం.ఈ విధంగా ఈ కార్యక్రమానికి ఈయన ఉద్దేశపూర్వకంగా రాలేదా లేకపోతే రానివ్వలేదా అనే విషయం తెలియాల్సి ఉంది.ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న సమయంలో రాజశేఖర్ రెడ్డి సోషల్ మీడియా ఖాతా నుంచి రెండు కులాలను ఉద్దేశిస్తూ చేసిన పోస్టులు దుమారం రేపాయి.

Macherla Niyojakavargam: డైరెక్టర్ కు అండగా నిలిచిన నితిన్…

ఇలా ఈ పోస్టుల కారణంగా పెద్ద ఎత్తున వివాదం చెల్లరేగింది.అయితే ఈ విషయంపై స్పందించిన రాజశేఖర్ రెడ్డి ఎవరో ఉద్దేశపూర్వకంగా ఫేక్ అకౌంట్స్ సృష్టించి ఇలాంటి పోస్ట్ లు చేశారని ఈయన ఏకంగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.అదేవిధంగా నితిన్ సైతం డైరెక్టర్ కు మద్దతుగా నిలబడి తన గురించి వచ్చినటువంటి ఆరోపణలను తోసి పుచ్చారు. ఇలా ఈ వివాదం పెద్ద ఎత్తున చెలరేగడమే ఈయన ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి రాలేకపోయారని తెలుస్తోంది. ఈ విధంగా ఈ పోస్టుల ద్వారా ఈ సినిమాకు కావలసినంత నెగిటివ్ ఇంపాక్ట్ సినిమా పై పడింది. మరి ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులు సినిమాని ఎలా ఆదరిస్తారో తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago