దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. అయితే రోజు రోజుకీ పెరుగుతున్న కరోనా కేసులతో పాటు సోషల్ మీడియా లో పుకార్లు కూడా భారీగానే వస్తున్నాయి. ఇక బుల్లితెర నటీనటుల్లో కరోనా బారిన పడుతుండటంతో ఈ పుకార్లు మరింతగా పెరుగుతున్నాయి. లాక్ డౌన్ నేపధ్యంలో సినిమా పరిశ్రమ మొత్తం షూటింగులని పక్కనపెట్టి ఇంటికే పరిమితమైతే రామ్ గోపాల్ వర్మ మాత్రం లాక్డౌన్ సమయంలోనూ కరోనా వైరస్ పై చిత్రాన్ని తీసి అందరినీ షాక్ కి గురిచేసాడు.
తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ టీమ్ లో ఒకరికి కరోనా పాజిటివ్ అని ప్రచారం జోరుగా జరిగింది. ఇప్పుడు ఆ వార్తలను ట్విట్టర్ వేదికగా ఖండించారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. తన టీమ్ లో ఎవరికీ కరోనా రాలేదని.. అవి పూర్తిగా అవాస్తవమని, ప్రభుత్వం సూచించిన అన్ని సూచనలని పాటిస్తూ షూటింగులు చేస్తున్నామని తెలియజేసారు రాంగోపాల్ వర్మ. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ఏటీటీ( ఎనీ టైమ్ థియేటర్) పేరుతో ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో తన సినిమాలని పే పర్ వ్యూ పద్దతిలో రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే..
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…