Rajinikanth: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ ఏంటో మనకు తెలిసింది. ఈయన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయినప్పటికీ కలెక్షన్లు మాత్రం రాబడుతుందనే విషయం మనకు తెలిసిందే.ఇకపోతే రజినీకాంత్ డైరెక్టర్ కె ఎస్ రవికుమార్ కాంబినేషన్ అంటే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పక్క హిట్ అనే కాన్ఫిడెన్స్ అందరిలోనూ ఉంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ముత్తు, పడయప్ప సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి.
ఇకపోతే ఎన్నో అంచనాల నడుమ వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం లింగ. ఈ సినిమా కూడా ఎన్నో అంచనాల నడుమ విడుదలయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా వరకు రజనీకాంత్ రవికుమార్ మధ్య ఎంతో మంచి అనుబంధం ఉండేది అయితే లింగా సినిమా డిజాస్టర్ కావడంతో పెద్ద ఎత్తున రజనీకాంత్ అభిమానులు దర్శకుడు రవికుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విధంగా రజనీకాంత్ అభిమానులు పెద్ద ఎత్తున దర్శకుడు పై విమర్శలు చేసినప్పటికీ ఏమాత్రం స్పందించని రవికుమార్ ఈ సినిమా విడుదలైన ఎనిమిది సంవత్సరాలకు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని లింగా సినిమా గురించి ప్రస్తావించారు.ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ లింగా సినిమా డిజాస్టర్ కావడానికి కారణం రజినీకాంత్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలోనే ఈయన మాట్లాడుతూ ఈ సినిమాలో క్లైమాక్స్ బెలూన్స్ సన్నివేషాలను ముందుగా మేము అనుకోలేదు.అయితే ఈ సినిమా సమయంలో రజినీకాంత్ అనారోగ్యానికి గురయ్యారు అయితే తాను చేసిన సన్నివేశాలను చూడాలని రజనీకాంత్ కోరడంతో ఆయనకు ఈ సినిమాని చూపించాము అయితే ఈ సన్నివేశాలను చూసిన రజనీకాంత్ కొన్ని మార్పులు చేశారు.ఆయన చేసిన సూచనలు డైరెక్టర్లకు ఇతర సిబ్బందికి నచ్చకపోయినా సినిమాలో పెట్టాల్సి వచ్చింది.ఇక ఈ సినిమాని రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని భావించాము తమకు సరైన సమయం లేకపోవడం వల్ల రజనీకాంత్ సూచించిన సన్నివేశాలు పెట్టడం వల్లే ఈ సినిమా ఫ్లాప్ అయ్యిందని ఈ సందర్భంగా రవికుమార్ రజనీకాంత్ లింగా సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…