Featured

Director Relangi Narasimharao : దాసరి సలహాకి ఎన్టీఆర్ నో చెప్పలేదు… అది ఆయన డైరెక్టర్లకు ఇచ్చే గౌరవం…: డైరెక్టర్ రేలంగి నరసింహారావు

Director Relangi Narasimharao : పాలకొల్లు కి చెందిన రేలంగి నరసింహారావు గారు దాదాపుగా తెలుగులో డెబ్భై సినిమాలు తీశారు. ఎక్కువగా రాజేంద్ర ప్రసాద్ హీరోగా సినిమాలు చేసిన ఆయన సినిమా ప్రయాణంలోని విశేషాలను తాజాగా ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తెలుగే కాకుండా కన్నడలో కూడా సినిమాలను డైరెక్ట్ చేసారు నరసింహారావు. ఇక ఆయన సుమన్, రేవతి, కిన్నెరలను తెలుగు తెరకు పరిచయం చేసారు. రేలంగి గారు కూడా దాసరి నారాయణ రావు గారి శిష్యుడే. దాసరి గారి వద్దే ఉంటూ ఆయనకు దగ్గరగా పనిచేసిన రేలంగి గారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ శత జయంతి సందర్బంగా ఎన్టీఆర్ గురించి ఆయన అనుభవాలను పంచుకున్నారు.

డైరెక్టర్స్ కి గౌరవం ఇస్తారు…

ఎన్టీఆర్ గారి ‘సర్ధార్ పాపారాయుడు’ సినిమాకి అనధికారికంగా దాసరి గారి వద్ద ఉండటం వళ్ళ షూటింగ్ పనుల్లో పాల్గొన్న రేలంగి నరసింహారావు గారు ఆ తరువాత ఎన్టీఆర్ గారి ‘సర్కస్ రాముడు’ సినిమాకు ఆఫీసియల్ గా పనిచేసారు. ఇక ఎన్టీఆర్ గారు సెట్స్ లో ఎలా ఉంటారు అనే విషయం మాట్లాడుతూ సర్కస్ రాముడు సినిమాలో ఒక పాట చిత్రీకరణ కోసం స్టిల్స్ తీస్తున్న సమయంలో నల్ల కళ్ళజోడు పెట్టుకుని ఎన్టీఆర్ గారు ఉంటే దాసరిగారు నల్ల కళ్ళజోడు వద్దు తీసేయమని చెప్పారు. దాంతో ఆయన వెంటనే తీసేసారు అది ఆయన డైరెక్టర్స్ కి ఇచ్చే విలువ అంటూ చెప్పారు.

ఇక మరో షూటింగ్ కోసం ఊటి వెళ్లిన సమయంలో పాట చిత్రీకరణ కోసం ఊటి వెళ్లగా అక్కడే వేరొక చోట యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించాలని మొదట ప్లాన్ చేసి చెప్పినా ఆపైన వెంటనే ఊటి వెళ్ళవలసి రాగా హోటల్ వెళ్లి ఫ్రెష్ అయి మీరు వస్తే ఊటి వెళదాం అని డైరెక్టర్ దాసరి గారు చెబితే పక్కన ఉన్న సెలయేరు లో స్నానం చేసేసి ఊటి వెళ్ళిపోతే సరిపోతుంది కదా మళ్ళీ హోటల్ కి వెళ్లడం ఎందుకు అంటూ ఆయన అక్కడే స్నానం చేసి వచ్చారు. అందుకే ఆయన చైతన్య రథం సమయంలో రోడ్డు పక్కన స్నానం చేసినా మాకు ఆశ్చర్యంగా అనిపించలేదు అంటూ ఆయన అంత ఎత్తు ఏదిగినా చాలా ఒదిగి ఉంటారు అంటూ ఎన్టీఆర్ గారి గొప్పతనం గురించి చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago