Hero Daggubati Abhiram : దగ్గుబాటి ఇంటి నెక్స్ట్ జనరేషన్ వారసుడిగా సినిమాల్లోకి హీరోగా అడుగుపెట్టబోతున్న మరో నటుడు సురేష్ బాబు తనయుడు దగ్గుబాటి అభిరామ్ . ఇప్పటికీ బాబాయ్ వెంకటేష్ నట వారసత్వాన్ని అన్న రానా సినిమాల్లో తానేంటో నిరూపించుకోగా ఇక ఇప్పుడు అభిరామ్ కూడా సినిమాల్లో తన సత్తా చూపించడానికి సిద్ధమయ్యడు. అయితే సినిమాల్లోకి ఇంకా అడుగుపెట్టక ముందే దగ్గుబాటి అభిరామ్ ఒకానొక సందర్భంలో బాగా వైరల్ అయ్యాడు. సినిమా ఇండస్ట్రీ లో క్యాస్టింగ్ కౌచ్ గురించి సెన్సేషన్ క్రియేట్ చేసిన శ్రీ రెడ్డి, అభిరామ్ తో తనకు అఫైర్ ఉందంటూ ఫోటోలు బయట పెట్టడంతో అప్పట్లో బాగా వైరల్ అయ్యాడు. సినిమా ప్రొడక్షన్ పనులను చూసుకుంటూ సినిమా ఇండస్ట్రీ లోనే ఉన్న అభిరామ్ తాజాగా నటన వైపు ఆసక్తితో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
తప్పులు అందరు చేస్తారు…..
అభిరామ్ హీరోగా డైరెక్టర్ తేజా దర్శకత్వంలో ‘అహింస’ అనే సినిమా రాబోతోంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలను స్టార్ట్ చేసిన సినిమా యూనిట్ అందులో భాగంగా పలు ఇంటర్వ్యూ లలో పాల్గొంటున్నారు. అలా అభిరామ్ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తన లైఫ్ లోని రీగ్రెట్స్ గురించి ప్రశ్న ఎదురవగా లైఫ్ లో అందరు తప్పులను చేస్తారు వాటి నుండి పాఠాలు నేర్చుకుని మళ్ళీ అడుగు వేస్తారు నేను అంతే అంటూ సమాధానము ఇచ్చాడు.
హీరోగా ఎంట్రీ ఇవ్వడనికి ఇంత లేట్ అవడానికి కారణం తనకు ప్రొడక్షన్ వైపు వెళ్లాలా లేక నటన వైపు వెళ్లాలా అనే కన్ఫ్యూషన్ లో ఉండి ఆలస్యమైందని చెప్పారు. సినిమాలో డైరెక్టర్ తేజ ఏం చెబితే అది చేసినట్లు ఆయన ఒక మాస్టర్ అంటూ ఆయన చెప్పినట్లు చేస్తే చాలా నేర్చుకోవచ్చు అంటూ చెప్పారు. తన అన్న రానా దగ్గుబాటి కూడా అదే సలహా ఇచ్చాడంటూ అభిరామ్ చెప్పాడు . ఇక నెపోటిజం గురించి మాట్లాడుతూ నెపో కిడ్స్ అయినా టాలెంట్ లేకపోతే కెరీర్ ఉండదని అధికాక ప్రేక్షకుల నుండి ఎన్నో అంచనాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఒక ఇమేజ్ ను వాళ్ళు ఏర్పరుచుకుంటారని వాటిని దాటుకుని నిలబడగలగాలని చెప్పాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…