Director Teja : రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా ఆయన వద్ద సినిమాటోగ్రాఫర్ గా పనిచేసి రాత్, గులాం తదితర హిందీ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసి అవార్డ్స్ కూడా అందుకున్నారు. తరువాత సినిమా డైరెక్టర్ అయిన తేజ చిత్రం, నువ్వు నేను, జయం వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఇక ఆయన సినిమాల్లో హీరోల దగ్గరి నుండి చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకు అందరినీ ఆడిషన్ చేసి ఆయనే స్వయంగా ఎంపిక చేస్తారు. చాలా రోజుల గ్యాప్ తరువాత డైరెక్టర్ తేజ మళ్ళీ ‘అహింస’ అనే సినిమాతో వస్తున్నాడు. కొత్తవాళ్ళను ఎక్కువగా ప్రోత్సహించే తేజ మరోసారి కొత్త హీరోతో వస్తున్నాడు. కాకపోతే దగ్గుబాటి ఇంటి అబ్బాయి అభిరామ్ ను హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమా చేసాడు. దీంతో ఇపుడిది హాట్ టాపిక్ అయింది. అభిరామ్ నే హీరోగా ఎందుకు తీసుకున్నాడు అనే విషయంలో తేజ క్లారిటీ ఇచ్చారు.
శ్రీరెడ్డి కి మాటిచ్చి మళ్ళీ అభిరామ్ ను హీరోగా ఎలా…
క్యాస్టింగ్ కౌచ్ మీద ఫిల్మ్ ఛాంబర్ ముందు నగ్నంగా పోరాడుతా అంటూ అప్పట్లో సంచలనం రేపిన శ్రీ రెడ్డి దగ్గుపాటి సురేష్ చిన్న కొడుకు అభిరామ్ మీద పలు ఆరోపణలు చేసింది. తాను అవకాశాలు ఇప్పిస్తానని లైంగికంగా వాడుకున్నాడు అంటూ కొన్ని ఫోటొలను కూడా అప్పట్లో విడుదల చేసి సంచలనం సృష్టించింది. ఆ సమయంలో డైరెక్టర్ తేజ శ్రీ రెడ్డి కి తన నెక్స్ట్ సినిమాలో ఆఫర్ ఇస్తా అని మాటిచ్చాడు. ఈ ఇష్యూ అయ్యాక నాలుగు సినిమాలను చేసిన తేజ ఆమెకు అవకాశం ఇవ్వలేదు. పైగా ఆమె ఎవరిపై అయితే ఆరోపణలను చేసిందో అతనిని హీరోగా లాంచ్ చేస్తున్నారు.
ఇక ఈ విషయం గురించి మీడియాలో ప్రశ్న ఎదురైంది డైరెక్టర్ తేజగారికి. దానికి ఆయన క్లారిటీ ఇస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా ఆమెకు అవకాశం ఇస్తాను అంటూ చెప్పి అహింస సినిమాలో అభిరామ్ ను తీసుకోడానికి ఆ కథకు అతనైతే కరెక్ట్ అని భావించి తీసుకున్నాను ఎవరి రికమెడేషన్స్ లేవు. నేను ఆడిషన్స్ చేశాకే ఒక చిన్న ఆర్టిస్ట్ నైనా సెలెక్ట్ చేస్తా, అలా ఆ అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు అంటూ చెప్పారు. ఇక క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ ఇండస్ట్రీలో ఉందేమో నా దగ్గర అయితే లేదు అంటూ చెప్పారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…