Categories: FeaturedMovie News

ఆ వ్యక్తి వల్లనే ఉదయ్ కిరణ్ హీరో అయ్యాడు… తేజా సంచలన వ్యాఖ్యలు..!!

ఉదయ్ కిరణ్.. టాలీవుడ్ చరిత్రలో పరిచయం అక్కర్లేని పేరు. ‘చిత్రం’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ లవర్‌ బోయ్.. వరుస విజయాలతో మంచి పేరుతో పాటు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను కూడా సొంతం చేసుకున్నాడు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వెండితెరపై ఎంట్రీ ఇచ్చి హీరోగా రాణించిన ఉదయ్ జీవితం ఎంతో మందికి ఆదర్శం.

కానీ ఈ లవర్ బోయ్ తన కెరీర్‌లో ఎంత త్వరగా రీచ్ అయ్యాడో.. అంతే త్వరగా డౌన్ కూడా అయ్యాడు. ఒకానొక సమయంలో టాలీవుడ్‌లో ఛాన్సులు లేక చాలా ఇబ్బందులు పడ్డ ఈ యువ హీరో జీవితంలోనూ విఫలమై 2014 జనవరి 5వ తేదీన ఆత్మహత్య చేసుకొని తనువు చాలించాడు. అయితే ఉదయ్ కిరణ్ సినీ కెరీర్ విఫలమవడం వెనుక ఎన్నో రూమర్లు వినిపించినా.. అందుకు సాక్ష్యాలు లేవు. ఏదేమైనా అప్పట్లో అతడి మరణం అందరి మనసునూ కదిలించింది. కలచివేసింది.

ఇదిలా వుండగా ఇటీవలికాలంలో మీడియా ముందుకొచ్చిన ప్రముఖ సినీ దర్శకులు తేజ గారు ఉదయ్ కిరణ్ కోసం కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం, నువ్వు-నేను, అవునన్నా-కాదన్నా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయఢంకా మ్రోగించిన సంగతి విదితమే..! మరి ఉదయ్ కిరణ్ కోసం తేజ తన మాటలలో ఏం చెప్పారంటే.. క్షణక్షణం షూటింగ్ సమయంలోనే చిత్రం సినిమాకి డైరెక్టర్‌గా మారాను. అంతకుముందు నేను కెమెరా అసిస్టెంట్‌గా, రాంగోపాల్ వర్మకు అసిస్టెంట్‌గా, ఆ తర్వాత కెమెరామెన్‌ గా వర్క్ చేశాను. క్షణక్షణం సినిమా కథ, స్క్రీన్ ప్లే రాసేటప్పుడే చిత్రం కథ రాశాను. అంటే 1991లో పూర్తి చేసిన కథను సినిమాగా 2000లో మొదలుపెట్టానని తేజ అన్నారు.

చిత్రం సినిమాకు మొదట ఉదయ్ కిరణ్ ని కాకుండా వేరే ఒక వ్యక్తిని హీరోగా అనుకొన్నాం. ఉదయ్ కిరణ్ హీరో ఫ్రెండ్‌గా నటించాల్సి ఉంది. అయితే ఆ సమయంలో హీరోగా అనుకొన్న వ్యక్తి చేయనన్నారు. దాంతో ఉదయ్ కిరణ్‌తో నువ్వే హీరో అన్నాం. ఆ తర్వాత మళ్లీ ఆ హీరోయే వచ్చి నేనే చేస్తా అన్నారు. దాంతో మళ్లీ ఉదయ్ కిరణ్‌ను నువ్వు హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేయమంటే సరేనన్నాడు. చివరకు హీరోగా చేస్తానని ముందుకొచ్చిన వ్యక్తి చేతులెత్తేయడంతో ఉదయ్ కిరణ్‌కే హీరోగా ఛాన్స్ దక్కింది. ఇక నా రెండో సినిమా తర్వాత ఫ్యామిలీ సర్కస్, ఆ తర్వాత నువ్వు నేను స్టార్ట్ చేశాం. ఫ్యామిలీ సర్కస్ యావరేజ్‌గా ఆడింది.

నువ్వునేను సినిమాకు మాధవన్‌ను హీరోగా అనుకొన్నాం. ఇక చిత్రం తర్వాత ఉదయ్ కిరణ్‌కు అవకాశాలు రాలేదు. ఆ సమయంలో ఉదయ్ కిరణ్ మా ఆఫీస్‌కు వచ్చి కూర్చొనేవాడు. అదే సమయంలో నిధి ప్రసాద్ సినిమాకు ఉదయ్ కిరణ్ హీరోగా చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా మొదలు కాకపోవడంతో ఉదయ్ కిరణ్ టెన్షన్‌లో ఉన్నాడని తేజ చెప్పారు. నువ్వు నేను కోసం మేము మాధవన్ ప్రయత్నిస్తే తానిక తెలుగు సినిమాలలో నటించనని ఖచ్ఛితంగా చెబితే ఏం చేయాలో తోచలేదు. పక్కనే ఉన్న ఉదయ్ కిరణ్ చూసి నువ్వే మా సినిమాకు హీరో అన్నాం. అలా నువ్వునేనులో ఉదయ్ కిరణ్ హీరో అయ్యాడు. ఆ తర్వాత సినిమా భారీ హిట్ కావడంతో ఉదయ్ కిరణ్ కెరీర్ గ్రాఫ్ మారిపోయింది అని తేజ తెలిపారు.

ఇదే ఇంటర్వ్యూలో హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను కూడా బయటపెట్టారు దర్శకుడు తేజ. ఉదయ్ చాలా అమాయకుడని, చాలా మంచివాడని, ఇండస్ట్రీలో పరిస్థితులు అర్థం చేసుకోలేక చనిపోయాడని అన్నారు. ఉదయ్‌కి పర్సనల్ లైఫ్‌లో కూడా ఇబ్బందులు ఉన్నాయని, వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని కారణాల వల్లే ఈ కుర్రాడికి సమస్యలు తెచ్చాయన్నారు. నిజానికి ‘ఔనన్నా కాదన్నా’ సినిమాకి ముందే ఓ సారి ఆత్మహత్యకు ప్రయత్నించాడన్న విషయాన్ని కూడా వెల్లడించారు తేజ.
ఏదేమైనా ఓ మంచి మనిషిని కోల్పోవడం బాధ కలిగించిందన్నారు తేజ.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago